Guinness World Record: ఇండియాకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్, గర్వించదగ్గ విషయం అంటోన్న గడ్కరీ

కేంద్ర రోడ్ రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ ఇండియా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో ఎంటర్ అయిందని ప్రకటించారు. అత్యధిక పొడవైన రోడ్ నిర్మించనందకుగానూ ఈ ఘనత దక్కింది.

Guinness World Record: ఇండియాకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్, గర్వించదగ్గ విషయం అంటోన్న గడ్కరీ

Union Minister Nitin Gadkari

Guinness World Record: కేంద్ర రోడ్ రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ ఇండియా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో ఎంటర్ అయిందని ప్రకటించారు. అత్యధిక పొడవైన రోడ్ నిర్మించనందకుగానూ ఈ ఘనత దక్కింది. నేషనల్ హైవే 53ను 75కిలోమీటర్ల పాటు నిర్మించిన రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకన్ ప్రైవేట్ లిమిటెడ్కు జగదీశ్ కదమ్ కు ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలియజేశారు. ఇంతకీ ఈరోడ్ ఎక్కడ ఉందో తెలుసా.. మహారాష్ట్రలోని అమరావతి.. అకోలా జిల్లాల మధ్య వేసింది.

టీం మొత్తానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ ట్వీట్ లో ఇలా పేర్కొన్నారు.

“దేశం మొత్తానికి ఇది గర్వించదగ్గ విషయం. ప్రత్యేకంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు అభినందనలు. రాజ్ పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, జగదీశ్ కదమ్ లకు కూడా. 75కిలోమీటర్ల మేర బిట్యూమినస్ కాంక్రీట్ రోడ్ వేయగలిగారు. పగలూరాత్రి శ్రమించి నిర్మాణ పనుల్లో భాగమైన ఇంజినీర్లకు, వర్కర్లకు థ్యాంక్స్ చెబుతున్నా” అని వివరించారు.

Read Also : గడ్కరీ వ్యాఖ్యలపై కమలనాథులు గుస్సా

కొత్తగా నిర్మించిన రహదారి ప్రాముఖ్యత గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, “అమరావతి నుండి అకోలా సెక్షన్ జాతీయ రహదారి 53లో భాగం, ఇది ముఖ్యమైన తూర్పు-పశ్చిమ కారిడార్. కోల్‌కతా, రాయ్‌పూర్, నాగ్‌పూర్, అకోలా వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది. మన దేశంలోని ఖనిజాలు అధికంగా ఉన్న ప్రాంతం మీదుగా వెళుతుంది.

అమరావతి నుండి అకోలా వరకు దాదాపు 35 శాతం, అకోలా నుండి చిక్లి సెక్షన్ వరకు దాదాపు 65 శాతం పనులు పూర్తయ్యాయని సమాచారం అందింది. ఈ విజయాన్ని ప్రయాణీకులు గొప్ప సౌకర్యంగా భావిస్తారు. ట్రాఫిక్ సజావుగా ఉండటంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుంది” అని వెల్లడించారు.

 Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw