Team India: విండీస్‌పై విజయంతో పాక్ రికార్డు బ్రేక్ చేసిన టీమిండియా

విండీస్ వీరులపై వరుస విజయాలు సాధించింది టీమిండియా. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మూడో మ్యాచ్ ఆడకుండానే 2-0తో గెలిచేసింది. ఈ గేమ్‌తో సిరీస్ మాత్రమే కాదు.. మరో రికార్డ్ బ్రేక్ చేసింది టీమిండియా. వరుసగా.. వెస్టిండీస్‌పై 12వ ద్వైపాక్షిక విజయాన్ని నమోదు చేసింది.

Team India: విండీస్‌పై విజయంతో పాక్ రికార్డు బ్రేక్ చేసిన టీమిండియా

Teamindia

 

 

Team India: విండీస్ వీరులపై వరుస విజయాలు సాధించింది టీమిండియా. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మూడో మ్యాచ్ ఆడకుండానే 2-0తో గెలిచేసింది. ఈ గేమ్‌తో సిరీస్ మాత్రమే కాదు.. మరో రికార్డ్ బ్రేక్ చేసింది టీమిండియా. వరుసగా.. వెస్టిండీస్‌పై 12వ ద్వైపాక్షిక విజయాన్ని నమోదు చేసింది. ఇలా ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించడంలో పాకిస్తాన్ రికార్డ్ బ్రేక్ చేసింది.

పాకిస్తాన్ పేరిట జింబాబ్వేను 11మ్యాచ్ లు ఓడించినట్లుగా రికార్డ్ అయింది. ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో రెండు మ్యాచ్ లను గెలిచిన టీమిండియా ఒకే జట్టుపై అత్యధిక ద్వైపాక్షిక సిరీస్ లు గెలిచి పాక్ రికార్డ్ చేసింది.

చివర్లో అక్షర్‌పటేల్‌ దంచికొట్టడంతో భారత్‌ ఈ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 2-0తేడాతో సిరీస్‌ను టీమ్‌ ఇండియా కైవసం చేసుకుంది. అక్షర్‌పటేల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌… భారత్‌ముందు 312 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

Read Also: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎవ‌రు వ‌చ్చారో చూడండి: బీసీసీఐ

లక్ష్య ఛేదనలో శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, దీపక్‌ హుడా తలా ఓ చేయి వేసి ఆదుకున్నారు. అయితే ఆఖరి పది ఓవర్లలో జట్టు విజయానికి వంద పరుగులు అవసరమైనవేల అక్షర్‌ పటేల్‌ రెచ్చిపోయాడు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌ రెచ్చిపోయింది. ఓపెనర్‌ షై హోప్‌ 115 రన్స్‌తో చెలరేగిపోయాడు. తన వందో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ 39, బ్రూక్స్‌ 35; కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ 74 రన్స్‌తో రాణించడంతో 50 ఓవర్లలో ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్‌ మూడు వికెట్లు తీయగా.. దీపక్‌, అక్షర్‌ పటేల్‌, చాహల్‌ తలో వికెట్‌ తీశారు.