Wheat Flour: గోధుమ, మైదా పిండి ఎగుమ‌తుల‌పై భార‌త్ ఆంక్ష‌లు

భార‌త్‌లో ఆహార ధాన్యాల ధరలను అదుపు చేయ‌డానికి ఇప్ప‌టికే కేంద్ర ప్రభుత్వం గోధుమ ఎగుమతులను నిషేధించింది. తాజాగా, గోధుమ పిండి, ర‌వ్వ‌, మైదా, త‌దిత‌ర ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల‌పై కూడా ఆంక్ష‌లు విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

Wheat Flour: గోధుమ, మైదా పిండి ఎగుమ‌తుల‌పై భార‌త్ ఆంక్ష‌లు

Wheat

Wheat Flour: భార‌త్‌లో ఆహార ధాన్యాల ధరలను అదుపు చేయ‌డానికి ఇప్ప‌టికే కేంద్ర ప్రభుత్వం గోధుమ ఎగుమతులను నిషేధించింది. తాజాగా, గోధుమ పిండి, ర‌వ్వ‌, మైదా, త‌దిత‌ర ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల‌పై కూడా ఆంక్ష‌లు విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఫార‌న్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నిర్ణ‌యం ఈ నెల 12 నుంచి అమ‌ల్లోకి రానుంది. గోధుమ పిండి, ర‌వ్వ‌, మైదా, త‌దిత‌ర ఉత్ప‌త్తుల ఎగుమ‌తులు చేయాల‌నుకుంటే మొద‌ట అనుమ‌తి తీసుకోవాల్సిందేన‌ని పేర్కొంది.

Maharashtra: మ‌హారాష్ట్ర కొత్త ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే ఇంటి వ‌ద్ద భారీగా నిలిచిన‌ వ‌ర్ష‌పు నీరు

గోధుమ‌, గోధుమ పిండికి సంబంధించి అంత‌ర్జాతీయ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌లో ఆటంకాలు ఏర్పడుతున్నాయ‌ని, దీంతో వాటి ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు క‌న‌ప‌డుతున్నాయ‌ని తెలిపింది. అలాగే, నాణ్య‌త‌తో కూడిన గోధుమ‌, గోధుమ పిండిని స‌ర‌ఫ‌రా చేయడంలోనూ స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయ‌ని పేర్కొంది. భార‌త్ నుంచి ఎగుమతి చేసే గోధుమ‌ల విష‌యంలో నాణ్య‌త ఉండడం త‌ప్ప‌నిస‌రి అని చెప్పింది. గోధుమ పిండి, ర‌వ్వ‌, మైదా, త‌దిత‌ర ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల‌పై పూర్తి స్థాయిలో నిషేధం విధించలేద‌ని తెలిపింది. అయితే, ఎగుమ‌తి చేసే ముందే అనుమ‌తులు తీసుకోవాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.