దేనికైనా రెడీ: చైనా ట్యాంక్‌లు, స్థావరాలను ధ్వంసంచేసే అపాచీ హెలికాఫ్టర్లు, మిగ్ 29 యుద్ధవిమానాలను మోహరించిన భారత వైమానిక దళం

10TV Telugu News

చైనా మరింత దుస్సాహసం ప్రదర్శించకుండా భారత సైన్యం సన్నద్ధమవుతోంది. సరిహద్దుల్లోని వాయుసేన శిబిరాలు, ఎయిర్‌ఫీల్డ్స్‌కు వైమానికదళం తన సామగ్రిని తరలిస్తోంది. లెహ్‌ పర్వత ప్రాంతాల్లో భారత వైమానిక దళ హెలికాప్టర్లతో పాటు యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే సమయంలో IAF Chief ఆర్‌కేఎస్‌ భదౌరియా రెండు రోజుల పర్యటన కోసం లెహ్‌ వచ్చారు. 

సిగ్నల్ రాగానే నింగికెగిరే అత్యాధునిక Sukhoi – 30 MKI,  Mig -29,Mirage – 2000, Jaguar Fighter‌ యుద్ధ విమానాలను IAF ముందుకు తరలించింది. లెహ్‌ శిబిరానికి సమీపంలో చినూక్‌ హెలికాప్టర్లనూ సిద్ధంగా ఉంచారు. సైనికులకు  అనుకూలంగా MI – 17 V 5 Medium Lift Chapar‌ భారత్ ఉపయోగిస్తోంది. CH 47 హెలికాఫ్టర్లు అత్యంత ఎత్తులో ఎగరగలగడమే కాకుండా భారత్‌ దగ్గరున్న అన్ని విమానాల కన్నా ఎక్కువ బరువును మోసుకొని వెళ్లగలవు.

ఇక ట్యాంకులను నాశనం చేయగల సామర్ధ్యం ఉన్న Apache Helicopter Guardianను కూడా సిద్ధంగా ఉంచారు. పర్వత ప్రాంతాల్లోని బంకర్లను కూడా నాశనం చేయగల సామర్థ్యం వీటి సొంతం. పగటిపూటే  కాకుండా రాత్రి పూట కూడా ఇవి దాడులు చేయగలవు. చైనా బలగాల కదలికలను ఇవి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాయి. 

లద్దాఖ్‌, టిబెట్‌, అదమ్‌పుర్‌, హల్వారా, అంబాలా, సిర్సా ఎయిర్‌బేస్‌లు హైఅలర్ట్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో చైనా కంటే మన వైమానికదళానికే పట్టు ఎక్కువగా ఉంది. ఒప్పందానికి విరుద్ధంగా భారత అధీనంలోని లద్దాఖ్‌  సమీప ప్రాంతంలో చైనా హెలికాప్టర్లు ఎగిరేందుకు ప్రయత్నించడంతో హోతన్‌, గార్‌ గున్సా వద్ద 14,000 అడుగుల ఎత్తున  భారత వాయుసేన SU – 30 యుద్ధ విమానాలను మోహరించింది. ఇటు వాయుసేన అధినేత  భదౌరియా లద్దాఖ్‌లో పర్యటించారు. వాయుసేన సన్నద్ధతను ఆయన పరిశీలిస్తున్నారు. భదౌరియా జూన్‌17న లెహ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే.

అక్కడి నుంచి జూన్‌18న శ్రీనగర్‌ వాయుసేన శిబిరానికి వెళ్లారు. ఈ రెండు శిబిరాలు తూర్పు లద్దాఖ్‌కు సమీపంలో ఉంటాయి. పర్వత ప్రాంతాల్లో యుద్ధ విమానాల సేవలకు అనువుగా ఉంటాయి.  ఇటు చైనా కూడా భారీగా బలగాలను మోహరిస్తున్నట్లు కనిపిస్తోంది.

టిబెట్‌ ప్రాంతంలోని బేస్‌లకు ఆయుధాలను తరలిస్తోంది. అయితే అత్యంత ఎత్తైన ప్రాంతాల నుంచి ఆపరేషన్స్ నిర్వహించాల్సి రావడం చైనాకు మైనస్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. బరువు విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది. ఇక పాకిస్థాన్‌ ఆక్యుపైడ్‌ కశ్మీర్‌లోని సర్దూ ఎయిర్‌బేస్‌ను కూడా చైనా అవసరమైతే ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు. భారత వైమానిక దళం దీనిపై కూడా ఓ కన్నేసి ఉంచింది.

 

Read:  ప్రపంచ కప్ భారత్ అమ్మేసుకుందా : విచారణకు లంక ప్రభుత్వం ఆదేశం