China And India : చైనా బుద్ధి మారదా ? రోజుకొక కుట్ర..కవ్వింపు చర్యలు

చైనా బుద్ధి మారదా? ఓవైపు శాంతి చర్చలని వెల్లడిస్తుంటారు. మరోవైపు కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటారు. చైనాది ఇదే నైజమని మరోసారి నిరూపితమైంది.

China And India : చైనా బుద్ధి మారదా ? రోజుకొక కుట్ర..కవ్వింపు చర్యలు

India

Arunachal Pradesh :  చైనా బుద్ధి మారదా? ఓవైపు శాంతి చర్చలని వెల్లడిస్తుంటారు. మరోవైపు కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటారు. చైనాది ఇదే నైజమని మరోసారి నిరూపితమైంది. రోజుకొక కుట్రతో కవ్వింపు చర్యలు చేపడుతోంది. చైనా మరో దుస్సాహసానికి పాల్పడింది. దాదాపు 200 మంది చైనా సైనికులు తవాంగ్‌ కబ్జాకు కుట్ర పన్నారు. భారత్‌పై దురాక్రమణకు ప్రయత్నించింది. అయితే భారత్‌ ఆర్మీ అలెర్ట్‌గా ఉండడంతో డ్రాగన్‌ తోక ముడుచుకోని వెళ్లిపోయింది. స‌రిహ‌ద్దులో చైనా ఆగ‌డాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ల‌డఖ్ నుంచి అరుణాచ‌ల్ వ‌ర‌కు ఏదో ఒక చోట ఇండియాను రెచ్చగొట్టే కార్యక‌లాపాల‌కు పాల్పడుతూనే ఉంది. 2020 మేలో తూర్పు లద్ధాక్‌లో సరిహద్దు ఆక్రమణకు యత్నించి భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన చైనా ఇప్పటివరకు తన్న బుద్ధిని మార్చుకోలేదు.

Read More : Prashant Kishor: కాంగ్రెస్‌ టార్గెట్‌గా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కామెంట్స్!

అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటున్న చైనా : –
వాస్తవాధీన రేఖవద్ద శాంతిని పాటించాలని తజకిస్తాన్‌ రాజధాని దుషాన్‌బే వేదికగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జయశకంకర్‌, వాంగీ మధ్య భేటీలో గత నెల 16న నిర్ణయం తీసుకోగా అంతలోనే చైనా కుట్రకు సంబంధించి ఈ విషయం బయటకు వచ్చింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ త‌మ భూభాగ‌మే అంటూ కొన్ని ద‌శాబ్దాలుగా చైనా పేచీ పెడుతునే ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌ భారత్ భూభాగం అనడానికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. అంతర్జాతీయ చిత్రపటాల్లో కూడా అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్‌లో భాగంగా చూపిస్తారు. చైనా మాత్రం టిబెట్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్‌ కూడా తమదే అంటోంది. ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్‌గా పిలుస్తోంది. దీనిపై ఇరు దేశాల మధ్య ఎన్నిసార్లు చర్చలు జరిగినా.. అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేకత ఎదురైనా చైనా తన దురాక్రమణ ఆలోచనల్లో మాత్రం ఏ మార్పు రాలేదు.

Read More : Chinese Troops : అరుణాచల్ ప్రదేశ్‌‌పై చైనా కన్ను, చొచ్చుకొచ్చిన ఆర్మీ..డ్రాగన్ కుట్రలను అడ్డుకున్న భారత్

తవాంగ్ ప్రాంతంలో : –
తూర్పు ల‌డఖ్‌ ప్రాంతంలో ఆక్రమ‌ణ‌కు ప్రయ‌త్నిస్తున్న చైనా.. అక్కడ భారత్ ఆయుధాలను మోహరించడంతో అరుణాచల్‌ ప్రదేశ్‌వైపు ఫోకస్‌ చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను తమదిగా చెప్పుకునే చైనా తవాంగ్‌ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చింది. ఇండియన్‌ ఆర్మీ పెట్రోలింగ్‌ చేస్తోన్న సమయంలో సైలెంట్‌గా సరిహద్దుల్లోకి ఎంట్రీ ఇచ్చింది చైనా. బంకర్లను టార్గెట్ చేసుకుంది. అనుమానం వచ్చిన భారత్ దళాలు బంకర్లవైపు వెళ్లడంతో చైనా గుట్టు రట్టైంది. దొంగచాటుగా బంకర్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్న డ్రాగన్‌ ఆర్మీని భారత్‌ పట్టుకుంది. వారందరిని భారత్ ఆర్మీ నిర్బంధించింది. చైనా లోకల్‌ అధికారులతో చర్చలు జరిపి వార్నింగ్‌ ఇచ్చి ఆర్మీని విడిచిపెట్టింది. మరోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే సీన్‌ వేరేలా ఉంటుందని హెచ్చరించి వదిలేసింది.