భార‌త‌దేశంలో క‌రోనా..లాక్ డౌన్ విధిస్తారా ? అమిత్ షా అఖిల ప‌క్ష మీటింగ్‌

  • Published By: madhu ,Published On : June 15, 2020 / 01:55 AM IST
భార‌త‌దేశంలో క‌రోనా..లాక్ డౌన్ విధిస్తారా ? అమిత్ షా అఖిల ప‌క్ష మీటింగ్‌

భార‌త‌దేశంలో కరోనా య‌మ స్పీడుగా దూసుక‌పోతోంది. వేల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. వైర‌స్ వ్యాపించ‌కుండా..కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా..చాప కింద నీరులా వైర‌స్ విస్త‌రిస్తోంది. మ‌ర‌ణాలు కూడా అదేస్థాయిలో ఉండ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకొనేందుకు సిద్ధ‌మౌతోంద‌ని తెలుస్తోంది. లాక్ డౌన్ కంటే ముందు..క‌రోనా వైర‌స్ కేసులు ఎక్కువ‌య్యానే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్ర‌తి రోజు 9 నుంచి 10 వేల కేసులు న‌మోద‌వుతున్నాయి. కేసులు ఎక్కువ‌గా మ‌హారాష్ట్ర‌లోనే న‌మోద‌వుతున్నాయి. 

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్య‌క్ష‌త‌న అఖిల‌ప‌క్ష స‌మావేశం జ‌రుగ‌బోతోంది. 2020, జూన్ 15వ తేదీ సోమ‌వారం జ‌రిగే ఈ స‌మావేశంపై అంద‌రి చూపు నెల‌కొంది. ఉద‌యం 11 గంట‌ల‌కు జ‌రిగే ఈ స‌మావేశానికి బీజేపీతో పాటు, కాంగ్రెస్‌, ఆప్‌, బీఎస్పీ పార్టీల ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతున్నారు. దీంతో రాష్ట్రాలు ఎలాంటి అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తార‌నే ఉత్కంఠ నెల‌కొంది. 
మ‌రోసారి లాక్ డౌన్ విధిస్తార‌ని సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే..అదంతా ఫేక్ అంటున్నారు కొంత‌మంది. లాక్ డౌన్ అమ‌లు చేస్తున్న కూడా క‌రోనా వైర‌స్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదంటున్నారు. ప్ర‌జ‌ల‌కు వైర‌స్ గురించి స్ప‌ష్టంగా అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, నిబంధ‌న‌లు పాటిస్తే..వైర‌స్

వ్యాపించ‌కుండా నిరోధించ‌వ‌చ్చ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు భార‌త‌దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్నా…రిక‌వ‌రీ కేసులు కూడా పెరుగుతుండ‌డం శుభ‌ప‌రిణామం. క‌రోనాపై కంట్రోల్ అయిన‌ట్లేన‌ని, మ‌ర‌లా లాక్ డౌన్ విధిస్తే..ఇప్ప‌టికే ఆర్థికంగా న‌ష్ట‌పోయిన‌..రాష్ట్రాలు..మ‌రింత దివాళ తీస్తాయంటున్నారు. ప్ర‌జ‌ల ఆర్థిక ప‌రిస్థితి మ‌రింత ప‌త‌నం అవుతుంద‌ని కొన్ని రాష్ట్రాలు వెల్ల‌డిస్తున్నాయ‌ని టాక్‌. మ‌రి కేంద్రం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందానే దానిపై కొద్ది గంట‌ల్లో తేల‌నుంది.