India Open 2022 : ప్రపంచ ఛాంపియన్‌‌కు షాక్.. సత్తా చాటిన లక్ష్య సేన్

చివరకు 24-22, 21-17 తేడాతో విజయం సాధించాడు. మూడో భారత పురుష ఆటగాడిగా నిలిచాడు అంతకముందు...ఈ టైటిల్ ను...

India Open 2022 : ప్రపంచ ఛాంపియన్‌‌కు షాక్.. సత్తా చాటిన లక్ష్య సేన్

Lakshyasen

Badminton Tournament Lakshya Sen : ఇండియా ఓపెన్ పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ సత్తా చాటాడు. 2022, జనవరి 16వ తేదీ ఆదివారం ఇండియా ఓపెన్ – 2022 పురుషుల సింగిల్స్ టైటిల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ప్రపంచ ఛాంపియన్ లోహ్ కీన్ యూతో లక్ష్య సేన్ తలపడ్డాడు. ఆద్యంత ఉత్కంఠగా ఈ పోటీ జరిగింది. ఇరువురు పాయింట్లు సాధించడానికి హోరాహోరీగా తలపడ్డారు.

Read More : Test Captain : బీసీసీఐకి కొత్త సవాల్‌.. కోహ్లీ స్థానంలో ఎవరు..?

మ్యాచ్ ఎవరి వైపు మళ్లుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే లక్ష్య సేన్ మాత్రం గురి తప్పకుండబా షాట్లు కొడుతూ ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు 24-22, 21-17 తేడాతో విజయం సాధించాడు. మూడో భారత పురుష ఆటగాడిగా నిలిచాడు అంతకముందు…ఈ టైటిల్ ను ప్రకాష్ పదుకొణె (1981), కిదాంబి శ్రీకాంత్ (2015) తొలి సూపర్ 500 ఛాంపియన్ షిప్ టైటిల్ ను గెలుచుకున్నారు.

Read More : India Covid : కోవిడ్ వ్యాక్సినేషన్‌‌లో మరో మైలురాయి

మెరుగైన ఆటతీరును కనబరిచిన లక్ష్య సేన్ ను పలువురు అభినందనలు తెలియచేస్తున్నారు. కేవలం 54 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగియడం విశేషం. మరోవైపు…పురుషుల డబుల్స్ టైటిల్ ను సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు గెలుచుకున్నారు. మహిళల సింగిల్స్ టైటిల్ మాత్రం థాయిలాండ్ వశం చేసుకుంది.