President Droupadi Murmu: చాపర్ దిగి.. 2కి.మీ నడిచి.. పూరీ జగన్నాథుడి సన్నిధికి కాలినడకన వెళ్లిన రాష్ట్రపతి ..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఒడిశాలో కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా గురువారం పూరీ జగన్నాథుడి సన్నిధికి రాష్ట్రపతి కాలినడకన వెళ్లారు. చాపర్ దిగి సుమారు రెండు కిలో మీటర్లు నడుచుకుంటూ ఆలయం వద్దకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

President Droupadi Murmu: చాపర్ దిగి.. 2కి.మీ నడిచి.. పూరీ జగన్నాథుడి సన్నిధికి కాలినడకన వెళ్లిన రాష్ట్రపతి ..

President Murmu

President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఒడిశాలో కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా గురువారం పూరీ జగన్నాథుడి సన్నిధికి రాష్ట్రపతి కాలినడకన వెళ్లారు. చాపర్ దిగి సుమారు రెండు కిలో మీటర్లు నడుచుకుంటూ ఆలయం వద్దకు చేరుకున్నారు. దారిపొడవునా వందలాది మంది భక్తులు ఆమెకు స్వాగతం పలికారు. దీంతో రాష్ట్రపతి వారికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆమె షేర్ చేశారు. కాలినడకన జగన్నాథుడి సన్నిధికి వెళ్తున్న రాష్ట్రపతి వెంట కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతర సీనియర్ అధికారులుకూడా ఉన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వరాష్ట్రమైన ఒడిశాకు రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లారు. గురువారం ఉదయం భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఘనస్వాగతం లభించింది. వెంటనే ఆమె ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్‌లో పూరీకి బయలుదేరారు. సముద్రతీర పట్టణంలోని ప్రఖ్యాత జగన్నాథ ఆలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రెండు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లి జగన్నాథుడిని సన్నిధికి చేరుకున్నారు. అనంతరం భువనేశ్వర్‌కు తిరిగి వచ్చిన తర్వాత, రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

President Droupadi Murmu : ‘ద్రౌపది’..నా అసలు పేరు కాదు! నా అసలు పేరు ఏంటంటే…!

ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన ముర్ము శుక్రవారం ఇతర కార్యక్రమాలకు హాజరవడంతో పాటు భువనేశ్వర్‌లోని పాఠశాలను కూడా సందర్శించాల్సి ఉంది. జూలైలో రాష్ట్రపతి అయిన తర్వాత ముర్ము ఒడిశా రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలిసారి. ముర్ము పర్యటన సందర్భంగా రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని అన్ని కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అర్ధరోజు సెలవు ప్రకటించింది.