Covid: కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి.. ఒక్క రోజులో 16 వేల కేసులు

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,103 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 31 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,711కాగా, యాక్టివ్ కేసుల శాతం 0.26. పాజిటివిటీ రేటు 4.27 శాతంగా ఉంది.

Covid: కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి.. ఒక్క రోజులో 16 వేల కేసులు

Covid

Covid: భారత్‌లో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,103 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 31 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,711కాగా, యాక్టివ్ కేసుల శాతం 0.26. పాజిటివిటీ రేటు 4.27 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,35,02,429. కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,25,199. కరోనా రికవరీ రేటు 98.54 శాతం. కరోనా నుంచి శనివారం 13,929 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 4,28,65,519. దేశంలో 197.95 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తైంది.

Mexico Mayor: మొసలిని పెళ్లి చేసుకున్న మేయర్.. ఎందుకో తెలుసా!

12-14 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఈ వయసు వారిలో 3.69 కోట్ల మంది ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే, 2.39 కోట్ల మంది సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు. 15-18 ఏళ్ల వయసువారిలో 6.05 కోట్ల మంది ఫస్ట్ డోస్, 4.90 కోట్ల మంది సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. 4.08 కోట్ల మంది బూస్టర్ డోసు తీసుకున్నారు. వీరిలో 60 ఏళ్లు దాటిన వృద్ధులతోపాటు, హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారు. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ముంబైలోనే 811 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.