India Corona: దేశంలో మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు.. ఒకేరోజు 45మంది మృతి..

దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత నాలుగు రోజులుగా 15వేల మార్క్ కు దిగువగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 4.59లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,906 మందికి కొవిడ్ సోకింది.

India Corona: దేశంలో మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు.. ఒకేరోజు 45మంది మృతి..

Covid 19 Cases

India Corona: దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత నాలుగు రోజులుగా 15వేల మార్క్ కు దిగువగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24గంటల్లో 4.59లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,906 మందికి కొవిడ్ సోకింది. దీంతో ఇప్పటివరకు కొవిడ్ సోకిన వారి సంఖ్య 4,36,69,850కి చేరుకుంది. ఇక నిన్నటితో పోల్చితే 24.2శాతం ఎక్కువగా కొవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి.

Covid-19: కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి.. ఒక్క రోజే 13 వేల కేసులు నమోదు

గడిచిన 24గంటల్లో యాక్టివ్ కేసులు 1,414 నమోదు కాగా, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,32,457కి చేరాయి. మంగళవారం ఒక్కరోజే కొవిడ్ తో చికిత్స పొందుతూ 45 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 5,25,519కి చేరుకుంది.  మంగళవారం 15,447 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రెండేళ్ల కాలంలో  వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య  4.36 కోట్ల (98.49 శాతం)కు చేరింది.

Telangana Covid Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు.. హైదరాబాద్‌లో అత్యధికం

ప్రధాన నగరాల్లో కోవిడ్ కేసుల వివరాలు చూస్తే..  గడిచిన 24గంటల్లో ఐదు రాష్ట్రాల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 2,659 కేసులు, మహారాష్ట్రలో 2,435 కేసులు, తమిళనాడులో 2,280 కేసులు, కేరళలో 2,211 కేసులు, కర్ణాటకలో 891 కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల నుంచి దాదాపు 61.97 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోనే 15.73 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజు 11,15,068 డోస్‌లు వైద్య సిబ్బంది అందించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం డోస్‌ల సంఖ్య 1,99,12,79,010కి చేరుకుంది.