India Covid-19: తగ్గని కరోనా ఉధృతి.. దేశంలో భారీగా కొత్త కేసులు నమోదు

గడిచిన 24 గంటల్లో దేశంలో 4,17,895 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 20,044 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతానికి పెరిగింది. తాజా కేసులతో కలుపుకొని ఇప్పటివరకు దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,37,30,071కి చేరింది.

India Covid-19: తగ్గని కరోనా ఉధృతి.. దేశంలో భారీగా కొత్త కేసులు నమోదు

COVID 19

India Covid-19: దేశంలో కొవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గడిచిన రెండు రోజులుగా 20వేలకుపైగా కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. శనివారంసైతం అదే స్థాయిలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 4,17,895 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 20,044 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతానికి పెరిగింది. తాజా కేసులతో కలుపుకొని ఇప్పటివరకు దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,37,30,071కి చేరింది.

India COVID-19: ఆ రాష్ట్రంలో మినహా.. దేశవ్యాప్తంగా తగ్గిన కోవిడ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే..

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,40,760గా ఉంది. శుక్రవారం ఒక్కరోజు కొవిడ్ తో చికిత్స పొందుతూ 18,301 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,30,63,651కి చేరింది. రికవరీ రేటు 98.48 శాతంగా నమోదైంది. గడిచిన 24గంటల్లో కొవిడ్ తో చికిత్స పొందుతూ 53 మంది మరణించారు. దేశంలో కొవిడ్ తో మృతిచెందిన వారి సంఖ్య 5,25,660కి చేరాయని, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కొవిడ్ వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం వరకు దేశంలో 199,71,61,438 డోసులు వైద్య సిబ్బంది పంపిణీ చేశారు. మరోవైపు దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వ్యాధి వ్యాప్తి నివారణ నిమిత్తం కేంద్ర ఆరోగ్యశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసిన విషయం విధితమే.