India Corona Cases : దేశంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 625 పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసులు వెయ్యిలోపే నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 625 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

India Corona Cases : దేశంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 625 పాజిటివ్ కేసులు

CORONA CASES

India Corona Cases : దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసులు వెయ్యిలోపే నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 625 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,62,141కి చేరింది.

దేశంలో ప్రస్తుతం 14,021 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 4,41,17,611 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఎలాంటి మరణాలు నమోదు కాకపోవడం శోచనీయం. కాగా, ఇప్పటి వరకు 5,30,509 మంది కరోనా బారిన పడి కారణంగా మృతి చెందారు.

COVID infection: బ్రిటన్‌లో 411 రోజుల పాటు కరోనా పాజిటివ్‌తో బాధపడ్డ వ్యక్తి.. ఎట్టకేలకు విముక్తి

మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98. 78శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.74 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశారు.