Covid-19 Second Wave : దేశంలో సెకండ్ వేవ్‌.. ఏప్రిల్ 20 నాటికి గ‌రిష్ట స్థాయికి క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. ఏప్రిల్ నెల మ‌ధ్య వ‌ర‌కు క‌రోనా పాజిటివ్‌ కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేశారు.

Covid-19 Second Wave : దేశంలో సెకండ్ వేవ్‌.. ఏప్రిల్ 20 నాటికి గ‌రిష్ట స్థాయికి క‌రోనా కేసులు

India Covid 19 Second Wave

India Covid-19 Second Wave : దేశంలో క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. ఏప్రిల్ నెల మ‌ధ్య వ‌ర‌కు క‌రోనా పాజిటివ్‌ కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేశారు. మే నెల చివ‌ర వ‌ర‌కు వైరస్ కేసులు త‌గ్గే అవ‌కాశాలు ఉన్నాయని అంటున్నారు. సూత్ర అనే గ‌ణిత విశ్లేష‌ణ సంస్థ కోవిడ్ కేసుల తీవత్రపై రిపోర్టు ఇచ్చింది.

భార‌త్‌లో తొలి కరోనా వేవ్‌పై కూడా సూత్ర గ‌తంలోనే నివేదిక ఇచ్చింది. ఆగ‌స్టులో కరోనా కేసుల తీవ్రత పెరిగి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు హెచ్చు స్థాయికి చేరుకుంటాయని పేర్కొంది. 2021 ఫిబ్ర‌వ‌రిలో మ‌ళ్లీ కరోనా కేసులు త‌గ్గుతాయ‌ని సూత్ర అంచనా వేసింది. ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌కు చెందిన మ‌హీంద్ర అగ‌ర్వాల్ కరోనా కేసుల తీవ్రతపై అంచ‌నాలు చేశారు.

ప్ర‌స్తుతం ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య‌ను ప‌రిశీలిస్తే.. ఏప్రిల్ మధ్య వ‌ర‌కు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంద‌న్నారు. ఏప్రిల్ 15 నుంచి 20 నాటికి కరోనా కేసులు సంఖ్య గ‌రిష్ట స్థాయికి చేరే అవ‌కాశం ఉంద‌న్నారు. అయితే మే నెల తర్వాత కరోనా తీవ్రత కూడా అంతే వేగంగా తగ్గుతుందని అగర్వాల్ పేర్కొన్నారు.

కొత్త ఇన్‌ఫెక్ష‌న్ల డేటా ఆధారంగా కేసుల సంఖ్య‌ను అంచ‌నా వేస్తున్నామ‌ని, తొలుత పంజాబ్‌, త‌ర్వాత మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు తారా స్థాయికి చేరుకుంటాయ‌ని అన్నారు. ఏప్రిల్‌-మే నెల మ‌ధ్య కాలంలో కేసులు గ‌రిష్ట స్థాయిలో ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు.