Sri Lanka: శ్రీ‌లంక‌కు మ‌రో 40,000 మెట్రిక్ ట‌న్నుల డీజిల్ పంపిన భార‌త్

తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీ‌లంక‌కు భార‌త్ సాయం కొనసాగిస్తోంది. తాజాగా 40,000 మెట్రిక్ ట‌న్నుల డీజిల్‌ను ఆ దేశానికి పంపింది.

Sri Lanka: శ్రీ‌లంక‌కు మ‌రో 40,000 మెట్రిక్ ట‌న్నుల డీజిల్ పంపిన భార‌త్

Srilanka Diesel

Sri Lanka: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీ‌లంక‌కు భార‌త్ సాయం కొనసాగిస్తోంది. తాజాగా 40,000 మెట్రిక్ ట‌న్నుల డీజిల్‌ను ఆ దేశానికి పంపింది. నౌక ద్వారా ఆ డీజిల్ కొలంబోకు చేరుకుంద‌ని భార‌త హైకమిష‌న్ మంగ‌ళ‌వారం తెలిపింది. ఇంధ‌నాన్ని దిగుమ‌తి చేసుకునేందుకు విదేశీ మార‌క నిల్వ‌లు శ్రీ‌లంక వ‌ద్ద కావాల్సినంత లేక‌పోవ‌డంతో ఆ దేశానికి భార‌త్ గ‌త నెల‌ అద‌నంగా దాదాపు 3,881 కోట్ల రూపాయ‌లు ప్రకటించిన‌ విష‌యం తెలిసిందే.

RS polls: కె.ల‌క్ష్మ‌ణ్ స‌హా 8 మంది బీజేపీ నేత‌లు నామినేష‌న్ల దాఖ‌లు

కాగా, శ్రీ‌లంకకు 1948లో స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎన్న‌డూ ఎదుర్కోనంత సంక్షోభాన్ని ఆ దేశం ఇప్పుడు ఎదుర్కొంటుండ‌డంతో భార‌త్ ఆ దేశానికి సాయం కొన‌సాగిస్తోంది. ఏప్రిల్‌-మే నెల‌ల్లో శ్రీ‌లంక‌కు భార‌త్ మొత్తం 4,00,000 మెట్రిక్ ట‌న్నుల ఇంధ‌నాన్ని పంపింది. పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌, నిత్యావ‌స‌ర స‌రుకుల కొర‌త‌, విద్యుత్ సంక్షోభాన్ని శ్రీ‌లంక ఎదుర్కొంటోంది. దీంతో శ్రీ‌లంక ప్ర‌జ‌లు నానా క‌ష్టాలు ప‌డుతున్నారు.