India’s COVID Cases : కరోనా కల్లోలం, భారతదేశంలో భయానక పరిస్థితులు..వణికిపోతున్న రాష్ట్రాలు

కరోనా సెకండ్‌వేవ్‌తో దేశవ్యాప్తంగా మళ్లీ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కరోనా దెబ్బకి మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతోంది.

Curfew In Capitol : అన్ని రాష్ట్రాల కంటే ఢిల్లీలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 24 గంటల్లో 35వేల కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ రేటు 30 శాతం పెరిగింది. దీంతో… లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌తో బేటీ అయిన కేజ్రీవాల్.. లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాలు భయపెట్టడానికి చెప్పడం లేదని ప్రజలందరూ ఈ నిర్ణయానికి సహకరించాలని కోరారు. ఆరు రోజుల తరువాత లాక్ డౌన్ పొడగించే పరిస్థితి రాకూడదని కోరుకున్నారు. అలాగే వలస కార్మికులెవరూ ఢిల్లీ విడిచి వెళ్లొద్దని కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుంటే… ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, గ్యాస్ సిలిండర్లు, రెమ్‌డెసివిర్ మందులకు కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించారు. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడిన కొన్ని గంటలకే కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

వణికిపోతున్న మహారాష్ట్ర : –
కరోనా సెకండ్‌వేవ్‌తో దేశవ్యాప్తంగా మళ్లీ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కరోనా దెబ్బకి మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతోంది. రోజుకి 60 వేల నుంచి 70 వేల కొత్త కరోనా కేసులు నమోదవడం భయాందోళనకు గురిచేస్తోంది. ఆస్పత్రిలో బెడ్లు దొరక్క.. సరైన చికిత్స అందక కరోనా రోగులు వైరస్‌కి బలైపోతున్నారు. మరణాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. 24 గంటల్లోనే మహారాష్ట్రలో 68 వేలకు పైగా కేసులు నమోదయ్యయి. కరోనాతో 503 మంది చనిపోయారు.

యూపీలో పెరిగిపోతున్న కేసులు: –

కరోనాను కంట్రోల్‌ చేయడానికి కొన్ని రాష్ట్రాలు సెమీ లాక్‌డౌన్‌లు, నైట్‌ కర్ఫ్యూలు విధించినా ఫలితం కనిపించడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యే దీనికి అద్దం పడుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా వీరవీహారం చేస్తోంది. మహారాష్ట్రకు తీసుపోని విధంగా అక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. 10 రోజుల ముందు రోజుకు 10 వేల కూడా నమోదుకాని పాజిటివ్‌ కేసులు.. ఇప్పుడు ఏకంగా 30 వేలు దాటేస్తున్నాయి. 24 గంటల్లో యూపీలో 30 వేల 596 కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనా మహమ్మారి కేసులు ప్రారంభమైన తర్వాత యూపీలో ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అటు కరోనాతో ఒక్కరోజులో 129 మంది చనిపోయారు. ఇక యూపీలో యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు రెండు లక్షలకు చేరువైంది. యూపీ రాజధాని లక్నోలో ఒక్కరోజులో అత్యధికంగా 5 వేల 551 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 22 మంది మరణించారు.

హఢలిపోతున్న కర్ణాటక, ఢిల్లీ, కేరళ :-
ఇటు ఢిల్లీలో కరోనా కల్లోలం కంటిన్యూ అవుతోంది. ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో 25 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో వైరస్‌ కట్టడి కోసం ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధించారు. అటు కర్ణాటకలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 19,067 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 81 మంది చనిపోయారు. ఇక కరోనా దెబ్బకు కర్ణాటక రాజధాని బెంగళూరు హడలిపోతోంది. కర్ణాటకలో నమోదౌతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 60 శాతానికి పైగా బెంగళూరులో నమోదవుతున్నాయి. మరోవైపు కేరళలో కరోనా కేసులు ఒక్కసారిగి పెరిగిపోయాయి. ఏకంగా 18 వేలకు పైగ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చూస్తుంటే కేరళ మరోసారి కరోనా సూపర్ హాట్‌స్పాట్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Read More : Ap 10th, Inter Exams : ఏపీలో స్కూళ్లకు సెలవులు, షెడ్యూల్ ప్రకారమే…టెన్త్, ఇంటర్ పరీక్షలు

ట్రెండింగ్ వార్తలు