Sri Lanka: శ్రీలంకకు అండగా ఉంటాం: భారత్

శ్రీలంక, ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉంది. మేం శ్రీలంక ప్రజలకు అండగా ఉంటాం. వాళ్లు ఈ క్లిష్ట పరిస్థితుల్ని దాటేందుకు సహకరిస్తాం. అదనంగా మరో 3.8 బిలియన్ డాలర్ల సహాయం అందిస్తాం.

Sri Lanka: శ్రీలంకకు అండగా ఉంటాం: భారత్

Sri Lanka

Sri Lanka: ప్రస్తుతం సంక్షోభ సమయంలో శ్రీలంక ప్రజలకు అండగా ఉంటామని భారత్ హామీ ఇచ్చింది. శ్రీలంకలో నెలకొన్న తాజా సంక్షోభం నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. క్లిష్ట సమయంలో శ్రీలంకను ఆదుకుంటామని ప్రకటించింది. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Andhra Pilgrims: అమర్‌నాథ్‌లో 84 మంది ఏపీ యాత్రికులు సురక్షితం

‘‘శ్రీలంక, ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉంది. మేం శ్రీలంక ప్రజలకు అండగా ఉంటాం. వాళ్లు ఈ క్లిష్ట పరిస్థితుల్ని దాటేందుకు సహకరిస్తాం. అదనంగా మరో 3.8 బిలియన్ డాలర్ల సహాయం అందిస్తాం. శ్రీలంక ప్రజలు ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, ప్రజా స్వామికంగా నిలదొక్కుకునేందుకు సహకరిస్తాం’’ అని బాగ్చి తన ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీలంక ప్రజలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 13న ఆయన రాజీనామా చేయనున్నారు.

Red Alert: ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ

ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. మరోవైపు ప్రధాని విక్రమ సింఘే కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నివాసాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అయితే, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి, అందరి తరఫున కొత్త ప్రధానిని ఎన్నుకుంటానని విక్రమ సింఘే చెప్పారు.