Abhyas: ‘అభ్యాస్‌’ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన డీఆర్‌డీవో

దేశీయంగా అభివృద్ధి చేసిన గ‌గ‌న‌త‌ల వాహ‌నం 'అభ్యాస్‌'ను భార‌త్ ఇవాళ విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఈ ప్ర‌యోగాన్ని ఒడిశా, చాందిపూర్ తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (స‌మీకృత ప‌రీక్ష వేదిక‌) నుంచి నిర్వ‌హించారు.

Abhyas: ‘అభ్యాస్‌’ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన డీఆర్‌డీవో

Abyas

Abhyas: దేశీయంగా అభివృద్ధి చేసిన గ‌గ‌న‌త‌ల వాహ‌నం ‘అభ్యాస్‌’ను భార‌త్ ఇవాళ విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఈ ప్ర‌యోగాన్ని ఒడిశా, చాందిపూర్ తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (స‌మీకృత ప‌రీక్ష వేదిక‌) నుంచి నిర్వ‌హించారు. స‌ముద్ర త‌లానికి తక్కువ ఎత్తుతో పాటు స్థిర‌, అధిక స్థాయి ఎత్తులో నిర్దేశిత రీతిలో అభ్యాస్‌ను ప‌రీక్షించామ‌ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తెలిపింది. అభ్యాస్‌ను ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లోని రాడ‌ర్ల‌తో పాటు ఎల‌క్ట్రో-ఆప్టిక‌ల్ టార్గెటింగ్ వ్య‌వ‌స్థ‌ల వంటి ట్రాకింగ్ సెన్సార్లు ప‌ర్య‌వేక్షించాయ‌ని పేర్కొంది.

Maharashtra: రేపు బ‌ల‌ప‌రీక్ష.. మీ తీరు సరికాదు: సీఎం ఉద్ధ‌వ్‌కు గ‌వ‌ర్న‌ర్ లేఖ‌

కాగా, అభ్యాస్‌ను డీఆర్‌డీవోలోని ఏరోనాటిక‌ల్ డెల‌వ‌ప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ సంస్థ అభివృద్ధి చేసింది. ప‌లు ర‌కాల‌ క్షిపణుల సామర్థ్యాన్ని పరిశీలించే క్రమంలో వాటికి సంబంధించిన ఆయుధాలే లక్ష్యంగా అభ్యాస్‌ను ఉపయోగిస్తారు. శ‌ర‌వేగంగా ల‌క్ష్యాన్ని చేరుకునే అభ్యాస్‌ను మ‌రింత అభివృద్ధి చేసి తాజా ప్రయోగంలో దాన్ని ప‌రీక్షించారు. ఇనెర్షియ‌ల్ నేవిగేష‌న్ వ్య‌వ‌స్థ ఆధారిత మైక్రో-ఎల‌క్ట్రోమెకానిక‌ల్ వ్య‌వ‌స్థ‌ల‌ను అభ్యాస్‌కు వాడారు. ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డంలో మ‌నుషుల నియంత్ర‌ణ అవ‌స‌రం లేకుండా సొంతంగా ప్ర‌యాణించేలా అభ్యాస్‌ను అభివృద్ధి చేశారు. అభ్యాస్‌ను హైస్పీడ్‌ ఎక్స్‌పెండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌గానూ పిలుస్తారు. అభ్యాస్ ప‌రీక్ష విజ‌య‌వంతమైనందుకు ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీవోను అభినందించారు.