Taiwanese Envoy comments: భారత్-తైవాన్ చేతులు కలపాలి: చైనా చర్యలపై తైవాన్

చైనా నిరంకుశ చర్యలు, దాడుల నుంచి రక్షించుకోవడానికి భారత్-తైవాన్ చేతులు కలపాలని తైవాన్ రాయబారి అన్నారు. తైవాన్ జలసంధి విషయంలో భారత వైఖరి పట్ల తాము హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. భారత్-తైవాన్ మధ్య వాణిజ్య, సాంకేతిక సహకారం కూడా మరింత దృఢం కావాలని చెప్పారు. తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ పర్యటించడాన్ని కొందరు రెచ్చగొట్టే చర్యగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. అయితే, ఎన్నో ఏళ్లుగా గల్వాన్ లోయ, తూర్పు, దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్ విషయంలో ఎవరు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారో అందరికీ తెలుసని చెప్పారు.

Taiwanese Envoy comments: భారత్-తైవాన్ చేతులు కలపాలి: చైనా చర్యలపై తైవాన్

China-Taiwan conflict

Taiwanese Envoy comments: భారత్, తైవాన్‌పై ఓ నిరంకుశత్వ దేశం బెదిరింపులకు పాల్పడుతోందని చైనాను ఉద్దేశించి తైవాన్ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-తైవాన్ వ్యూహాత్మక సహకారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పింది. తైవాన్ ను ఆక్రమించుకోవడమే లక్ష్యంగా చైనా పలు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. భారత భూభాగాల విషయంలో కూడా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా, తైవాన్ రాయబారి భవుషుయాన్ గెర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

చైనా నిరంకుశ చర్యలు, దాడుల నుంచి రక్షించుకోవడానికి భారత్-తైవాన్ చేతులు కలపాలని అన్నారు. తైవాన్ జలసంధి విషయంలో భారత వైఖరి పట్ల తాము హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. భారత్-తైవాన్ మధ్య వాణిజ్య, సాంకేతిక సహకారం కూడా మరింత దృఢం కావాలని చెప్పారు. తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ పర్యటించడాన్ని కొందరు రెచ్చగొట్టే చర్యగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు.

అయితే, ఎన్నో ఏళ్లుగా గల్వాన్ లోయ, తూర్పు, దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్ విషయంలో ఎవరు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారో అందరికీ తెలుసని చెప్పారు. తైవాన్ తమపై దాడి జరగకుండా మాత్రమే చర్యలు తీసుకుంటోందని అన్నారు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి తాము ప్రతిరోజు అన్ని చర్యలూ తీసుకుంటూనే ఉన్నామని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 3,375 కరోనా కేసులు నమోదు