BrahMos missile: బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

ఎక్కువ దూరంలోని లక్ష్యాలను చేధించగల బ్రహ్మోస్ క్షిపణి పరీక్షను భారత్ విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్ ఫైటర్ విమానం నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను బంగాళాఖాతంలో గురువారం విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది.

BrahMos missile: బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

Brahmos Missile

BrahMos missile: ఎక్కువ దూరంలోని లక్ష్యాలను చేధించగల బ్రహ్మోస్ క్షిపణి పరీక్షను భారత్ విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్ ఫైటర్ విమానం నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను బంగాళాఖాతంలో గురువారం విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది. గతంలో ప్రయోగించిన బ్రహ్మోస్‌తో పోలిస్తే, ఇవి మరింత ఎక్కువ దూరంలోని లక్ష్యాలను చేధిస్తాయి. ఇంతకుముందు ఈ క్షిపణి రేంజ్ 290 కిలోమీటర్లు కాగా, తాజా క్షిపణులు 350 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించగలవు.

 

సుఖోయ్-30ఎమ్‌కే ఐ ఫైటర్ విమానం నుంచి ప్రయోగం అనుకున్నట్లుగా జరిగిందని, నిర్దేశిత లక్ష్యాన్ని మిస్సైల్ కచ్చితత్వంతో సాధించిందని రక్షణ శాఖ పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా భారత వైమానిక దళానికి కొత్త శక్తి వచ్చినట్లైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డీఆర్‌డీవో, హెచ్ఏఎల్, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఈ క్షిపణి తయారీ, ప్రయోగంలో పాలుపంచుకున్నాయి. బ్రహ్మోస్ క్షిపణులు శబ్ద వేగంకంటే మూడు రెట్లు వేగంగా ప్రయాణించగలవు.