India Today C-Voter Survey : నితీశ్ ఎఫెక్ట్.. ఎన్డీయేకు 286కు మించి సీట్లు రావు.. ఇండియా టుడే సర్వేలో ఆసక్తికర ఫలితాలు

12 రోజుల్లోనే మొత్తం మారిపోయింది. కాదు.. కాదు.. బీహార్ అపరమేధావి నితీశ్ కుమార్ మొత్తం మార్చేశారు. బీజేపీ దూకుడుకు బ్రేకులు వేశారు. ఆగస్టు 1కి ముందు వరకు ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క. పొలిటికల్ ఈక్వేషన్స్ ను మార్చిపడేశారు నితీశ్. ఇండియా టుడే-సీఓటర్ సర్వే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

India Today C-Voter Survey : నితీశ్ ఎఫెక్ట్.. ఎన్డీయేకు 286కు మించి సీట్లు రావు.. ఇండియా టుడే సర్వేలో ఆసక్తికర ఫలితాలు

India Today C-Voter Survey : 12 రోజుల్లోనే మొత్తం మారిపోయింది. కాదు.. కాదు.. బీహార్ అపరమేధావి నితీశ్ కుమార్ మొత్తం మార్చేశారు. బీజేపీ దూకుడుకు బ్రేకులు వేశారు. ఆగస్టు 1కి ముందు వరకు ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క. పొలిటికల్ ఈక్వేషన్స్ ను మార్చిపడేశారు నితీశ్. ఇండియా టుడే-సీఓటర్ సర్వే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ఎన్డీయేకు నితీశ్ బైబై చెప్పడంతో బీజేపీలో పెద్ద తుపాను అయితే రాలేదు కానీ.. జేడీయూ ప్రభావం మాత్రం కాషాయ పార్టీపై గట్టిగానే ఉందట. ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 21 సీట్లు తగ్గడం ఖాయమంటూ ఇండియా టుడే సీఓటర్ సర్వే చెబుతోంది. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే విడుదల చేసిన ఫలితాలు ఆసక్తిని రేపుతున్నాయి.

ఆగస్టు 1న ఎన్నికలు జరిగి ఉంటే ఎన్డీయే కూటమికి 307 సీట్లు, యూపీఏకి 125 సీట్లు, ఇతర పార్టీలకు 111 సీట్లు వచ్చి ఉండేవని అంచనా వేసింది. అయితే, నితీశ్ ఇచ్చిన షాక్ తో పరిణామాలు మారిపోయాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే 286 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని సర్వే చెబుతోంది.

543 స్థానాలున్న లోక్ సభలో 272 మ్యాజిక్ ఫిగర్ ను ఎన్డీయే దాటుతుందని, అయితే కేవలం 14 సీట్ల మెజారిటీతోనే విజయం సాధిస్తుందని ఇండియా టుడే సర్వేలో తేలింది. అంటే ఎన్డీయే భారీ విక్టరీ కాస్త సాధారణ విజయంగా మారిందన్న మాట అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ క్రమంలో మరో రెండు మూడు మిత్రపక్షాలు ఎన్డీయేను వీడితే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉండటంతో ఈలోపు ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పడం కష్టం అంటున్నారు. నిన్నటివరకు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు 24 గంటలు తిరిగేలోపే మిత్రులుగా మారిపోతారని అంటున్నారు. దశాబ్దాలకు పైగా నువ్వా నేనా అని కొట్టుకున్న వాళ్లు ఒక్కరోజులోనే కలిసిపోవచ్చని చెబుతున్నారు.