IND vs AUS 1st ODI: ఇండియా, ఆస్ట్రేలియా తొలివన్డే .. రోహిత్ దూరం.. ఓపెనింగ్ జోడీపై క్లారిటీ ఇచ్చిన హార్ధిక్
వన్డే ఫార్మాట్లో ఈ ఏడాదిని టీమిండియా గొప్పగా ప్రారంభించింది. రెండు సిరీస్‌లలోనూ న్యూజిలాండ్, శ్రీలంకతో ఆడిన ఆరు మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది.

IND vs AUS ODI
IND vs AUS 1st ODI: ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ముగిసింది. మూడు వన్డేల సిరీస్ నేటి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు వాంఖడే స్టేడియంలో ఇరుజట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమవుతుంది. టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. అదేజోరును కొనసాగిస్తూ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి రెండు టెస్టు మ్యాచ్‌లలో బోల్తాపడిన ఆసీస్ .. చివరి రెండు టెస్టుల్లో పుంజుకుంది. అదే ఊపును వన్డేల్లో కొనసాగించి వన్డే సిరీస్‌నైనా దక్కించుకోవాలని ఆ జట్టు ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు.
IND vs AUS 4th Test Match, Live Updates In Telugu: డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు… సిరీస్ భారత్ కైవసం
వన్డే ఫార్మాట్లో ఈ ఏడాదిని టీమిండియా గొప్పగా ప్రారంభించింది. రెండు సిరీస్‌లలోనూ న్యూజిలాండ్, శ్రీలంకతో ఆడిన ఆరు మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. శుభ్‌మన్ గిల్ అద్భుత ఫామ్ లో ఉన్నారు. కోహ్లీసైతం ఫామ్‌లోకి రావడంతో పాటు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా వంటి ఆటగాళ్లతో ఇండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. తొలి వన్డేకు కుటుంబ కారణాలతో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. రోహిత్ లేకపోవటంతో గిల్‌తో కలిసి ఎవరు ఓపెనర్ గా వస్తారన్న చర్చ జరుగుతుంది. అయితే, ఈ విషయంపై హార్ధిక్ పాండ్యా క్లారిటీ ఇచ్చారు. ఇషాన్ కిషన్ గిల్‌తో కలిసి ఓపెనర్‌గా క్రీజులోకి వస్తారని చెప్పారు. మరోవైపు హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజాల రూపంలో ఇద్దరు ఆల్ రౌండర్లు ఉన్నారు. వారితోపాటు వాషింగ్టన్ సుందర్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు, చివరి రెండు టెస్టు మ్యాచ్‌లలో అద్భుత ఆటతీరును కనబర్చిన ఆసీస్.. అదేజోరును వన్డేల్లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. స్మిత్ సారథ్యంలో ఆసీస్ జట్టు బలంగా ఉంది. వార్నర్, హెడ్, స్మిత్, లుబుషేన్, స్టాయినిస్, మాక్స్వెల్ లతో కూడిన ఆసీస్ బ్యాటింగ్ లైనప్ భారత్ బౌలర్లకు గట్టి సవాల్‌ను విసరనుంది.
భారత్ తుది జట్టు అంచనా ..
శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కే.ఎల్. రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్); రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/ సుందర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.
ఆస్ట్రేలియా తుది జట్టు అంచనా ..
వార్నర్, ట్రావిస్ హెడ్, స్మిత్, లబుషేన్, స్టాయినిస్, మ్యాక్స్‌వెల్, కేరీ, కెమెరాన్ గ్రీన్, స్టార్క్, అడమ్ జంపా, నాథన్ ఎలిస్.