ఇదేం ఆట గురూ: ఆస్ట్రేలియాకు ప్రాణం పోసిన పంత్

ఇదేం ఆట గురూ: ఆస్ట్రేలియాకు ప్రాణం పోసిన పంత్

Rishabh Pant: ఆస్ట్రేలియా పర్యటనలో వికెట్ల వెనుక శుభారంభం నమోదు చేసిన రిషబ్ పంత్.. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఓపెనర్ పుకోస్కీ రెండు క్యాచ్‌లను జారవిడిచాడు. ఫలితంగా ఆస్ట్రేలియా తొలి రోజు ఆటముగిసేసరికి 2వికెట్లు నష్టపోయి 166పరుగులు చేయగలిగింది.

13ఓవర్ల తర్వాత ఇండియా తొలి బౌలింగ్ మారిన తర్వాత అటాక్ మొదలైంది. ఈ క్రమంలో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో పుకోస్కీ బ్యాలెన్స్ మిస్ అయి బ్యాట్ ఎడ్జ్ కు తాకేలా ఆడటంతో క్యాచ్ వెళ్లింది. అలా 22వ ఓవర్లో జరిగిన బంతిని పంత్ అందుకోలేకపోయాడు.

ఓ నాలుగు ఓవర్ల తర్వాత మళ్లీ..
మొదటి సారి జరిగిన పొరబాటును సరిదిద్దుకునే అవకాశం పంత్ కు మళ్లి వచ్చింది. సిరాజ్ బౌలింగ్ లో.. ఫాస్ట్ అండ్ షార్ట్ డెలివరీ వచ్చింది. గ్లౌజుల వరకూ వచ్చినా పంత్ సరిగ్గా అందుకోలేకపోయాడు. ఎంత ప్రయత్నించినా అప్పటికే గ్రౌండ్ ను తాకేసింది. అంతా ఔట్ అనేసుకున్నా.. రీప్లేలో క్లియర్‌గా నాటౌట్ అని కనిపించింది.

ఇండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్.. ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ.. పంత్ ను విమర్శించాడు. ఈ క్రమంలో పంత్ స్థానంలో సాహాను తీసుకోవాలని విమర్శకులు అంటున్నారు. స్పిన్ కండిషన్స్ లో సాహా పనితనం ఇంకా మెరుగ్గా ఉంటుందని, మెరుగైన బ్యాట్స్‌మన్ కూడా అని అంటున్నారు.