India vs England: అర్ధ సెంచరీలు బాదిన కోహ్లీ, హార్దిక్ పాండ్యా.. ఇంగ్లండ్ లక్ష్యం 169

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ కు టీమిండియా 169 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. కోహ్లీ, హార్దిక్ పాండ్యా అర్ధ సెంచరీలతో రాణించడంతో 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

India vs England: అర్ధ సెంచరీలు బాదిన కోహ్లీ, హార్దిక్ పాండ్యా.. ఇంగ్లండ్ లక్ష్యం 169

India vs England: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ కు టీమిండియా 169 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. కోహ్లీ, హార్దిక్ పాండ్యా అర్ధ సెంచరీలతో రాణించడంతో 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

భారత బ్యాట్స్‌మెన్ లో కేఎల్ రాహుల్ 5, రోహిత్ శర్మ 27, విరాట్ కోహ్లీ 50, సూర్యకుమార్ యాదవ్ 14, హార్దిక్ పాండ్యా 63, రిషబ్ పంత్ 6 (రనౌట్), రవిచంద్రన్ అశ్విన్ 0(నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 2, అదిల్ రషీద్, క్రిస్ వోక్స్ చెరో వికెట్ తీశారు. కాగా, ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ లో కోహ్లీ అర్ధ సెంచరీ చేయడం ఇది నాలుగో సారి. ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు.

నేటి మ్యాచులో గెలిచే జట్టు ఈ నెల 13న జరిగే ఫైనల్ మ్యాచులో పాకిస్థాన్ తో తలపడుతుంది. టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేయడంతో ఇక మ్యాచ్ అంతా భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ పైనే ఆధారపడి ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..