నేడే టీ20 మ్యాచ్.. ఓపెనింగ్ ఆడేదెవరు? ఎవరి బలమెంత?

నేడే టీ20 మ్యాచ్.. ఓపెనింగ్ ఆడేదెవరు? ఎవరి బలమెంత?

భారత్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టుతో టీ20 సిరీస్‌కు భారత జట్టు సిద్ధం అవుతోంది. ప్లేయింగ్ లెవన్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందా? అనేదానినపై అనుమానాలు సాగుతూనే ఉన్నాయి. వాస్తవానికి ప్లేయర్లు ఎక్కువగా ఉండగా.. ఓపెనింగ్ అవకాశం ఎవరికి వస్తుంది అనేది ఊహాతీతం. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో రోహిత్‌శర్మకు జోడీగా కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ చేయనున్నట్లు క్లారటీ ఇచ్చేశాడు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ. దావన్‌కు వీరిద్దరిలో ఒకరు అందుబాటులో లేని సమయంలోనే అవకాశం దక్కనుంది.

అంతేకాదు.. వాషింగ్టన్ సుందర్ ఉన్నంతవరకు పరిమిత ఓవర్ల జట్టులో అశ్విన్‌కు చోటు దక్కకపోవచ్చునని అన్నారు. ఫస్ట్ టీ20 మ్యాచ్ నేడు(12 మార్చి 2020) అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుండగా.. టీ20ల్లో టాప్ జట్లు అయిన రెండు జట్లకు మధ్య పోరు అంటే రసవత్తరంగా ఉంటుంది అని వీక్షకులు భావిస్తున్నారు. టెస్ట్ సిరీస్‍‌లో గెలిచిన కోహ్లి సేన ధీమాగా ఉండగా.. టి20ల్లో నంబర్‌ వన్‌ అయిన ఇంగ్లండ్‌తో ఆట అంటే మాత్రం అంత సులువు కాదు.

సిక్సర్ల విందు ఇవ్వడంలో రెండు జట్లు కూడా ఎక్కడా తగ్గే అవకాశం లేదు.. ఇంగ్లండ్‌ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఇండియన్ టీమ్ బ్యాటింగ్ ఆర్టర్ కంటే బలంగా ఉంది. పదకొండు మందిలో పది మంది హిట్టర్లే. ఓపెనర్లు జేసన్‌ రాయ్, బట్లర్‌లతో పాటు టి20 స్పెషలిస్టు డేవిడ్‌ మలన్, బెయిర్‌ స్టో, ఆల్‌రౌండర్‌ స్టోక్స్, కెప్టెన్‌ మోర్గాన్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్చర్‌ వరకు ఆడుతూనే ఉంటారు.

ఇక బాగా తెలిసిన పిచ్ కావడం.. బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండగా.. భారీ స్కోర్లు ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్నర్లు ప్రభావం చూపించగలరు.

Possible XI(England): జాసన్ రాయ్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), బెన్ స్టోక్స్, మోయిన్ అలీ, సామ్ కుర్రాన్, క్రిస్ జోర్దన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.

Possible XI(India): రోహిత్ శర్మ, KL రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్/సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకుర్/దీపక్ చహార్, చాహల్, నవదీప్ సైనీ / అక్సర్ పటేల్