పంత్ సూచనలతో భజ్జీ స్టైల్లో రోహిత్ బౌలింగ్

పంత్ సూచనలతో భజ్జీ స్టైల్లో రోహిత్ బౌలింగ్

India vs England: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ లు ఇద్దరూ కలిసి ఇండియా ప్లేయర్ల ఆటకు ప్రాణం పోశారు. చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదేశం ప్రకారం.. టీ బ్రేక్‌కు ముందు రోహిత్ శర్మ కొద్ది ఓవర్ల పాటు బౌలింగ్ వేశాడు. రెగ్యూలర్ బౌలర్లకు కాస్త గ్యాప్ ఇచ్చేందుకు ఇలా చేశారు.

రోహిత్ శర్మ 2ఓవర్ల వరకూ ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేశాడు. సెషన్ లో ఫైనల్ డెలివరీని హాఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్ ను ఇమిటేట్ చేశాడు. ఆ బంతి ఫుల్ టాస్ పడటంతో రూట్ కేవలం సింగిల్ మాత్రమే తీసి తర్వాతి ఓవర్ కు కూడా స్ట్రైకింగ్ లోనే నిలబడ్డాడు.

ఫీల్డ్ లో మరో రోజు టఫ్ సెషన్ జరిగినా.. డ్రెస్సింగ్ రూంలో వాతావరణం అలాగే ఉంది. రిషబ్ పంత్ వికెట్ల వెనుక ఉండి రోహిత్ శర్మకు సూచనలు ఇస్తూ కాసేపు రిఫ్రెష్ అయ్యేలా చేశాడు. దానికి కౌంటర్ ఇచ్చిన రోహిత్ శర్మ… అలాగే సర్ అనుకుంటూ సెటైరికల్ గా బదులిచ్చాడు.

చెపాక్ వేదికగా ఆడుతున్న ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ కు రిషబ్ పంత్ క్వాలిటీతో కూడిన కీపింగ్ అందించాడు. శుక్రవారం స్టంప్ మైక్‌లో పంత్ మాటలు ఇలా వినిపించాయి. జో రూట్.. డామ్ సిబ్లే 200పరుగుల భాగస్వామ్యం నెలకొ్ల్పినా నిరాశపడొద్దని ప్రేరణ నింపేలా మాట్లాడాడు.

రెండో రోజు ఆటలో టీ బ్రేక్ కు ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్.. అతని ఐదో డబుల్ సెంచరీ పూర్తి చేసేశాడు. కేవలం నదీమ్ ఒక్కడికే ఒక్క వికెట్ దక్కింది. ఇషాంత్ శర్మ, బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ లు కాస్త వెనుకపడ్డట్టే చెప్పాలి.