ENG vs IND : ఆసక్తికరంగా రెండో టెస్ట్, భారత బౌలర్లు రాణిస్తారా ?

ఇండియా-ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రోజు పూర్తిగా పైచేయి సాధించిన టీమిండియా రెండో రోజు కాస్త తడపడింది. ఓపెనర్లు వేసిన పునాదిపై భారీ స్కోరును నిర్మించే అవకాశాన్ని చేజార్చుకుంది. మరో 88 రన్స్‌ మాత్రమే చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. వెటరన్‌ పేసర్‌ జిమ్మీ అండర్సన్‌ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్‌ను రేసులోకి తెచ్చాడు.

ENG vs IND : ఆసక్తికరంగా రెండో టెస్ట్, భారత బౌలర్లు రాణిస్తారా ?

Kohli

India vs england : ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రోజు పూర్తిగా పైచేయి సాధించిన టీమిండియా రెండో రోజు కాస్త తడపడింది. ఓపెనర్లు వేసిన పునాదిపై భారీ స్కోరును నిర్మించే అవకాశాన్ని చేజార్చుకుంది. మరో 88 రన్స్‌ మాత్రమే చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. వెటరన్‌ పేసర్‌ జిమ్మీ అండర్సన్‌ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లాండ్ రేసులోకి తెచ్చాడు.

Read More : Sonia Gandhi: విపక్షాలతో సోనియా భేటీ.. ఆగష్టు 20న ముహూర్తం!

రెండో రోజు బ్యాటింగ్‌లో ఫెయిలైనా.. బౌలింగ్‌లో రాణించిన టీమిండియానే ప్రస్తుతానికి పైచేయి సాధించి ఉంది. భారత్ భారీ స్కోరును అడ్డుకొని బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్ .. రెండో రోజు ముగిసే సమయానికి 3 వికెట్లకు 119 పరుగులతో నిలిచింది. హైదరాబాదీ పేసర్‌ సీరాజ్‌ దెబ్బకు స్టార్టింగ్‌లోనే ఓపెనర్‌ సిబ్లే, హసీబ్ హామిద్‌ వికెట్లు కోల్పోయినా మరో రోరి బర్న్స్‌, కెప్టెన్‌ రూట్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. లాస్ట్‌ సెషన్‌లో బర్న్స్‌ను అవుట్ చేసిన షమీ ఇండియాకు ఊరటనిచ్చాడు.

Read More : Chittur : ప్రేమ, పెళ్లి, భర్త కళ్లెదుటే పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న భార్య

276/3 తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన టీమిండియా…364 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కేఎల్ రాహుల్ (129)..రెండు పరుగులు మాత్రమే జోడించాడు. జడేజా (40), పంత్ (37) పోరాడారు. ప్రధానంగా అండర్సన్ దెబ్బతీశాడని చెప్పవచ్చు. 62 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ శుక్రవారం ఆట చివరకు 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది.

Read More : T.Congress : కాంగ్రెస్‌‌లో కొత్త లొల్లి, నేతల పంచాయితీ సభా వేదికనే మార్చేసింది

23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును రోరీ బర్న్స్ (49), జో రూట్ (48)లు ఆదుకున్నారు. క్రీజులో పాతకపోవడంతో 2 వికెట్లకు 108 పరుగులు చేసి పటిష్టస్థితికి చేరుకుంది. ఆట ఆఖరుకు రూట్ కు తోడుగా బెయిర్ స్టో (6) క్రీజులో ఉన్నారు. బౌలర్లు ఏ మాత్రం రాణిస్తారో చూడాలి.