Ind vs NZ, WTC Final: ఆటకు ఆటంకం.. మళ్ళీ ఆగింది.. స్కోరు 146/3

ఆకాశం మేఘావృతమై బ్యాడ్ లైట్ కారణంగా మరోసారి ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు ఆటంకం కలిగింది. మరోసారి మ్యాచ్ నిలిచిపోయింది.

Ind vs NZ, WTC Final: ఆటకు ఆటంకం.. మళ్ళీ ఆగింది.. స్కోరు 146/3

Final

ICC World Test Championship Final 2021: ఆకాశం మేఘావృతమై బ్యాడ్ లైట్ కారణంగా మరోసారి ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు ఆటంకం కలిగింది. మరోసారి మ్యాచ్ నిలిచిపోయింది. భారత జట్టు 64.4 ఓవర్లలో మూడు వికెట్లకు 146 పరుగులు చేసిన సమయంలో.. విరాట్ కోహ్లీ 44 పరుగులు, రహానె 29 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానె నిలకడగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 64.4 ఓవర్లలో 146 పరుగులు చేసింది.

రోహిత్ శర్మ, షుబ్మాన్ గిల్ ఇన్నింగ్స్‌ ప్రారంభించగా.. భారత్‌కు మంచి ఆరంభం వచ్చింది అనుకునేలోగా.. మొదటి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. టీమిండియా స్కోరు 62 ప‌రుగుల వ‌ద్ద రోహిత్ శ‌ర్మ‌, ఆ వెంట‌నే 63 ప‌రుగుల వ‌ద్ద శుభ్‌మన్ గిల్ అవుట్ అయ్యారు.

కొద్దిసేప‌టి త‌ర్వాత టీమిండియా స్కోరు 88గా ఉన్నప్పుడు చ‌తేశ్వ‌ర్ పుజారా కూడా అవుటయ్యాడు. గోడలా నిలబడి ఆడుతున్నట్లుగా కనిపించిన పుజారా అవుట్ అవడంతో న్యూజిలాండ్ బౌలర్లు ఊపిరిపీల్చుకున్నారు. క్రీజులోకి వచ్చిన రహానే, కోహ్లీ జాగ్రత్తగా ఆడుతున్నారు.