India vs New Zealand: టెస్ట్‌ల్లో అశ్విన్ రికార్డు.. ఒక్క వికెట్ దూరంలో!

కాన్పూర్ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఖాతాలో ఓ వికెట్ ఉండగా, టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆర్అశ్విన్ విల్ యంగ్‌ని ఎల్‌బీ‌డబ్ల్యూ‌గా అవుట్ చేశాడు.

India vs New Zealand: టెస్ట్‌ల్లో అశ్విన్ రికార్డు.. ఒక్క వికెట్ దూరంలో!

R Aswin

India vs New Zealand: కాన్పూర్ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసేసరికి భారత్ ఖాతాలో ఓ వికెట్ ఉండగా, టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆర్.అశ్విన్ విల్ యంగ్‌ని ఎల్‌బీ‌డబ్ల్యూ‌గా అవుట్ చేశాడు. ఈ వికెట్ తీయడం ద్వారా ఆర్ అశ్విన్ ఓ రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టు క్రికెట్‌లో మొత్తం 417వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ వికెట్‌ తీసిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ హర్భజన్ సింగ్‌తో సమానంగా టెస్టుల్లో అత్యథిక వికెట్లు తీసిన వ్యక్తులతో సమానంగా మూడో ప్లేస్‌లో నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో 417 వికెట్లు తీసిన రికార్డు హర్భజన్ సింగ్ పేరిట ఉంది.

టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం తరపున 417 వికెట్లతో, R అశ్విన్ సుదీర్ఘ క్రికెట్ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా హర్భజన్ సింగ్‌తో సమానంగా నిలిచాడు. ఈ టెస్ట్‌లో ఇంకా ఒక రోజు మిగిలి ఉండగా.. ఒక వికెట్ తీస్తే చాలు.. హర్భజన్ సింగ్‌ను వెనుకకు నెట్టేసి ముందుకు వస్తాడు అశ్విన్. భారత్‌ నుంచి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో అనిల్‌ కుంబ్లే 619 వికెట్లతో నంబర్‌వన్‌ స్థానంలో ఉండగా, రెండో స్థానంలో కపిల్‌ దేవ్‌ 434 వికెట్లతో ఉన్నాడు.

అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో కేవలం 80 టెస్టు మ్యాచ్‌ల్లో 417 వికెట్లు పడగొట్టాడు, హర్భజన్ సింగ్ 103 టెస్టు మ్యాచ్‌ల్లో ఈ సంఖ్యను చేరుకున్నాడు. అంతేకాదు.. అశ్విన్ మరో రికార్డును కూడా కైవసం చేసుకున్నాడు. 2021 సంవత్సరానికి గాను అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. 41వికెట్లు ఈ ఏడాదిలో అశ్విన్ తీసుకున్నాడు. అగ్రస్థానంలో ఉన్న పాకిస్తాన్ క్రికెటర్ షాహీన్ అఫ్రీదీని వెనక్కి నెట్టి ఈ ఫీట్ అందుకున్నాడు అశ్విన్.

భారత్ నుంచి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు:

అనిల్ కుంబ్లే – 132 మ్యాచ్‌లు – 619 వికెట్లు

కపిల్ దేవ్ – 131 మ్యాచ్‌లు – 434 వికెట్లు

ఆర్ అశ్విన్ – 80 మ్యాచ్‌లు – 417 వికెట్లు

హర్భజన్ సింగ్ – 103 మ్యాచ్‌లు – 417 వికెట్లు

ఇషాంత్ శర్మ – 105 మ్యాచ్‌లు – 311 వికెట్లు