IndVs SA 5th T20I : బెంగళూరులో మళ్లీ వర్షం.. భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు అంతరాయం

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్, సౌతాఫ్రికా 5వ టీ20 మ్యాచ్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. బెంగళూరులో మళ్లీ వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ కు ఆటంకం కలిగింది.

IndVs SA 5th T20I : బెంగళూరులో మళ్లీ వర్షం.. భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు అంతరాయం

Indvssa 5th T20i

IndVs SA 5th T20I : బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్, సౌతాఫ్రికా 5వ టీ20 మ్యాచ్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. బెంగళూరులో మళ్లీ వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ కు ఆటంకం కలిగింది. 3.3 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత వర్షం కురవడం ప్రారంభమైంది. దీంతో ఆటగాళ్లు గ్రౌండ్ ను వీడి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయారు. సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పేశారు. ప్రస్తుతం భారత్ 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది.

మ్యాచ్ ఆరంభానికి అంతరాయం కలిగించిన వాన… మ్యాచ్ మొదలయ్యాక మరోసారి పలకరించింది. దాంతో ఆట నిలిచిపోయింది. వర్షం కారణంగా ఆటను 19వ ఓవర్లకే కుదించారు అంపైర్లు. ఇంతలో మళ్లీ వాన పడింది.

Dinesh Karthik : వరల్డ్ కప్ ఆడటమే ధ్యేయం.. నా జీవితంలో ఇదే ముఖ్యం..!

వర్షం కారణంగా మ్యాచ్ 50 నిమిషాల ఆలస్యంగా మొదలైంది. బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 3.3 ఓవర్లలో 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా, ఈ దశలో వరుణుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. దాంతో ఆట నిలిపివేసి మైదానాన్ని కవర్లతో కప్పివేశారు.

టీమిండియా ఇన్నింగ్స్ దూకుడుగా ఆరంభమైంది. దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ కేశవ్ మహరాజ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఇషాన్ కిషన్ రెండు సిక్సులు బాదాడు. అయితే, 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎంగిడి విసిరిన స్లో బాల్ ను అంచనా వేయలేక బౌల్డయ్యాడు. అనంతరం ఎంగిడి అదే ఊపులో మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (10) ను కూడా ఔట్ చేయడంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. వర్షం వల్ల ఆట ఆగిపోయే సమయానికి క్రీజులో శ్రేయాస్ అయ్యర్, కెప్టెన్ రిషబ్ పంత్ ఉన్నారు.

Mayank Agarwal : రాహుల్ స్థానంలో మయాంక్‌‌.. వైస్‌ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌..!

5 మ్యాచ్ ల సిరీస్ లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి డీలాపడిన టీమిండియా.. తర్వాత అనుహ్యంగా పుంజుకుంది. మూడు, నాలుగు టీ20ల్లో సౌతాఫ్రికాను చిత్తు చేసి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఇప్పుడు కీలకపోరుకు సిద్ధమైంది. సిరీస్‌ నిర్ణయాత్మక పోరులో ఇరుజట్లు తలపడుతునున్నాయి. ఈ సిరీస్‌లో రిషభ్ పంత్ మరోసారి టాస్‌ ఓడాడు. టాస్‌ నెగ్గిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో గాయపడిన తెంబా బవుమా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. దీంతో కేశవ్‌ మహరాజ్‌ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఈ సిరీస్ లో తొలి రెండు మ్యాచులను గెలిచిన సఫారీలు అదే ఊపులో సిరీస్ చేజిక్కించుకుంటారని భావించారు. అయితే, టీమిండియా ఆటగాళ్లు పోరాట పటిమ కనబర్చి వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గి సిరీస్ ను సమం చేశారు. ఇవాళ్టి మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.