India v Zimbabwe: ఆదివారం ఒకే రోజు మూడు మ్యాచ్‌లు.. ఇండియా గెలిస్తే సెమీ ఫైనల్!

ఇండియా-జింబాబ్వే జట్ల మధ్య ఆదివారం మెల్‌బోర్న్‌లో కీలక మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఇండియా సెమీ ఫైనల్ చేరుతుంది. లేదంటే ఇతర అవకాశాల మీద ఆధారపడాలి.

India v Zimbabwe: ఆదివారం ఒకే రోజు మూడు మ్యాచ్‌లు.. ఇండియా గెలిస్తే సెమీ ఫైనల్!

India v Zimbabwe: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం గ్రూప్-2లోని జట్ల మధ్య కీలక మ్యాచ్‍‌లు జరగబోతున్నాయి. ఇండియా-జింబాబ్వే జట్లతోపాటు, సౌతాఫ్రికా-నెదర్లాండ్స్, పాకిస్తాన్-బంగ్లాదేశ్ జట్లు ఆదివారం తలపడబోతున్నాయి.

Elon Musk: ఇండియన్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ షాక్.. భారీ సంఖ్యలో భారతీయుల తొలగింపు

ఈ మూడు మ్యాచ్‍‌లు టోర్నీలో ఎంతో కీలకమైనవి. ఈ మ్యాచ్‍‌ల ద్వారా సెమీస్ బెర్తులు ఖాయమవుతాయి. ఇండియాకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకమైంది. జింబాబ్వేపై గెలవడం ద్వారా నేరుగా జట్టు సెమీ ఫైనల్ చేరుతుంది. లేదంటే ఇతర అవకాశాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే పాకిస్తాన్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్‍‌లో పాక్ భారీ తేడాతో ఓడిపోవాలి. సౌతాఫ్రికా-నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‍‌లో నెదర్లాండ్స్ గెలవాలి. తాజా అంచనా ప్రకారం జింబాబ్వేపై భారత్ గెలిచే అవకాశాలున్నాయి. అయితే, ఈ జట్టును తేలికగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‍‌లో ఆ జట్టు ఎలా పోరాడి గెలిచిందో తెలిసిందే. అందుకే జింబాబ్వేతో జరిగే మ్యాచ్‍‌లో భారత్ అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని గెలవాలి.

Arvind Kejriwal: గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఐదు సీట్లే.. రెండో స్థానం మాదే: అరవింద్ కేజ్రీవాల్

దీంతో ఇండియా సెమీ ఫైనల్ చేరుతుంది. మరోవైపు నెదర్లాండ్స్‌పై సౌతాఫ్రికా గెలిస్తే ఆ జట్టు సెమీ ఫైనల్ చేరుతుంది. రేపటి మ్యాచ్‍‌ సందర్భంగా వర్షం పడే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ దీన్ని అక్కడి అధికారులు ఖండించారు. ప్రస్తుతం ఉన్న వాతావరణం ప్రకారం మ్యాచ్ జరిగే వేదిక అయిన మెల్‌బోర్న్‌లో వర్షం పడే అవకాశాలు లేవని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఇక గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్లు సెమీ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.