Indian Army Trained eagles : ఇండియన్ ఆర్మీ ‘గరుడాస్త్రం’.. శత్రుదేశం డ్రోన్లను కూల్చే సత్తా గద్దలకు ఉందా?

ఇండియన్ ఆర్మీ దగ్గర.. లేటెస్ట్, అడ్వాన్స్‌డ్ వెపన్స్ ఎన్నో ఉన్నాయ్. ఆయుధసంపత్తి పరంగా మన సైన్యం ఎంతో ముందుంది. శత్రువులపై పోరుకు, బాంబులను గుర్తించేందుకు ఎన్నో ఏళ్లుగా డాగ్ స్క్వాడ్ కూడా సేవలందిస్తోంది. అయితే.. లేటెస్ట్‌గా భారత సైన్యానికి సరికొత్త ఆయుధం దొరికింది. అవే.. డ్రోన్లను వేటాడే గద్దలు. శత్రుదేశం పాకిస్థాన్ నుంచి వచ్చే డ్రోన్లను కూల్చేందుకు వీటికి ట్రైనింగ్ ఇచ్చారు. దీంతో.. ఇండియా వైడ్ ఈ పక్షి రాజే హాట్ టాపిక్‌గా మారింది.

Indian Army Trained eagles : ఇండియన్ ఆర్మీ ‘గరుడాస్త్రం’.. శత్రుదేశం డ్రోన్లను కూల్చే సత్తా గద్దలకు ఉందా?

Indian Army Trained eagles To Destroy Enemy Drones

Indian Army Trained eagles : ఇండియన్ ఆర్మీ దగ్గర.. లేటెస్ట్, అడ్వాన్స్‌డ్ వెపన్స్ ఎన్నో ఉన్నాయ్. ఆయుధసంపత్తి పరంగా మన సైన్యం ఎంతో ముందుంది. శత్రువులపై పోరుకు, బాంబులను గుర్తించేందుకు ఎన్నో ఏళ్లుగా డాగ్ స్క్వాడ్ కూడా సేవలందిస్తోంది. అయితే.. లేటెస్ట్‌గా భారత సైన్యానికి సరికొత్త ఆయుధం దొరికింది. అవే.. డ్రోన్లను వేటాడే గద్దలు. శత్రుదేశం పాకిస్థాన్ నుంచి వచ్చే డ్రోన్లను కూల్చేందుకు వీటికి ట్రైనింగ్ ఇచ్చారు. దీంతో.. ఇండియా వైడ్ ఈ పక్షి రాజే హాట్ టాపిక్‌గా మారింది.

కచ్చితంగా ఉంది. చైనా సరిహద్దులకు దగ్గరగా.. ఉత్తరాఖండ్‌లోని ఔలిలో అమెరికా-భారత్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న యుద్ధ అభ్యాస్‌ విన్యాసాల్లో.. ఈ ట్రైన్డ్ గద్దను ఇండియన్ ఆర్మీ ప్రదర్శించింది. శత్రు దేశాల డ్రోన్లను కూల్చేసేందుకు.. భారత సైన్యం ఈ పక్షిరాజు సాయం తీసుకుంటోంది. ఇందుకోసం.. గద్దలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తోంది. సరిహద్దుల వెంట.. శత్రు దేశాల డ్రోన్‌లను కూల్చేసేందుకు అర్జున్ అనే ఈ ఈగల్‌కు ట్రైనింగ్ ఇచ్చారు. అది.. శత్రు డ్రోన్లను ఎలా నేలకూలుస్తుందో.. ఔలిలో జరుగుతున్న యుద్ధ అభ్యాస్‌-2022లో భాగంగా భారత సైన్యం ప్రదర్శించింది. ముందుగా ఓ డ్రోన్‌ను గాల్లో ఎగురవేశారు. తర్వాత.. దాని శబ్దాన్ని గ్రహించిన ఓ ఆర్మీ డాగ్.. సిబ్బందిని అప్రమత్తం చేసింది. వెంటనే సైనికుడి చేతి నుంచి ఎగిరి వెళ్లిన అర్జున్ ఈగల్.. ఆ చిన్న డ్రోన్‌ను గాల్లోనే కూల్చివేసింది.

వాస్తవానికి.. కింద నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటుంది. శత్రువులెవరైనా బోర్డర్ క్రాస్ చేసేందుకు ప్రయత్నిస్తే.. వెంటనే తగిన గుణపాఠం చెబుతుంది. కానీ.. ఇప్పుడు కింద నుంచే వచ్చే ప్రమాదాల కంటే.. పైనుంచి వచ్చే ప్రమాదాలు ఆర్మీకి సవాల్‌గా మారాయి. అందులో.. డ్రోన్లు కూడా ఒకటి. వీటి ద్వారానే.. శత్రుదేశం పాకిస్థాన్ నుంచి డ్రగ్స్, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, డబ్బులు.. ఇలా ఎన్నో ఇండియాలోకి పంపిస్తున్నారు. అవి కనిపించినప్పుడల్లా.. భారత సైన్యం పేల్చేస్తూనే ఉంటుంది. అయినా సరే.. అందరి కళ్లను గప్పి.. పాకిస్థాన్ డ్రోన్లు ఇండియా బోర్డర్ దాటుతూనే ఉన్నాయ్. అవి చేయాల్సిన పని చేస్తూనే ఉన్నాయ్. అందువల్ల.. ఈ డ్రోన్లకు చెక్ పెట్టాలని ఇండియన్ ఆర్మీ డిసైడ్ అయింది. వాటిని గాల్లోనే నాశనం చేసేలా.. గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.

ప్రధానంగా పంజాబ్, జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో డ్రోన్‌లను గుర్తించేందుకు భారత సైన్యం ఈ గద్దలను వినియోగిస్తోంది. ఈ ప్రాంతాల్లో పాకిస్థాన్ నుంచి వచ్చే డ్రోన్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్, పంజాబ్ సరిహద్దుల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారానే.. మాదక ద్రవ్యాలు, గన్స్, నగదను చేరవేస్తున్నారు. అలా.. పాక్ నుంచి వచ్చే డ్రోన్లను కూల్చడంలో సాయం చేసేందుకు గద్దలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అందుకే.. ఇండియన్ ఆర్మీలో ఈ ఈగల్స్‌ని సరికొత్త ఆయుధంగా చెబుతున్నారు. శత్రువుల డ్రోన్ల పనిపట్టేందుకే ప్రత్యేకంగా వీటికి శిక్షణ ఇచ్చారు. గాల్లో వచ్చే డ్రోన్లను.. గాల్లోనే వేటాడి నాశనం చేయడం వీటి ప్రత్యేకత. ఇండియన్ ఆర్మీలో ఇలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేయడం ఇదే తొలిసారి. పంజాబ్, జమ్ముకశ్మీర్‌ బోర్డర్ల మీదుగా వచ్చే డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు ఈ గద్దలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇండో-యూఎస్ 8వ ఎడిషన్ సంయుక్త యుద్ధ విన్యాసాల్లో భాగంగా.. రెండు దేశాల సైన్యం అత్యుత్తుమ వ్యూహాలు, టెక్నాలజీని ప్రదర్శిస్తున్నాయి. అందులో భాగంగానే.. భారత్ ఈ యాంటీ డ్రోన్ గద్దలను ప్రదర్శించింది.

ఇండియన్ ఆర్మీ దగ్గర డ్రోన్లను కూల్చేందుకు గద్దలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారని తెలిసిన రోజే.. పంజాబ్‌లో బోర్డర్ మీదుగా డ్రగ్స్ సప్లై చేస్తున్న రెండు పాక్ డ్రోన్లను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చేశారు. వాటి నుంచి పది కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 3 కిలోలకు పైగా మాదకద్రవ్యాలతో.. పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను అమృత్‌సర్ దగ్గర బీఎస్ఎఫ్ విమెన్స్ వింగ్ కూల్చేసింది. అమృత్‌సర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చహర్‌పూర్ సమీపంలో.. భారత భూభాగంలోకి పాక్ డ్రోన్ రాత్రి పూట ప్రవేశించిందని మహిళా సైనికులు గుర్తించారు. ఇద్దరు బీఎస్ఎఫ్ మహిళా సిబ్బంది దానిపై కాల్పులు జరిపి నేలకూల్చారు. మరో సంఘటనలో.. తరన్‌తరన్ జిల్లాలోని కలశ్‌ హవేలియన్‌ గ్రామం నుంచి భారత్‌లోకి ప్రవేశినస్తున్న డ్రోన్‌ను.. బీఎస్ఎఫ్ దళాలు కూల్చేశాయని అధికారులు తెలిపారు. అందులో నుంచి ఆరున్నర కిలోలకు పైగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వడాయి చీమా సరిహద్దులోనూ మరో డ్రోన్‌ను గుర్తించి కాల్పులు జరపగా.. అది పాకిస్థాన్ వైపు వెళ్లిపోయిందని తెలిపారు. ఇలా.. వరుసగా పాకిస్థాన్ నుంచి వస్తున్న డ్రోన్లను కనిపెట్టి.. వాటిని గాల్లోనే నాశనం చేసే విధంగా గద్దలకు ట్రైనింగ్ ఇచ్చారు. అవి చాలా సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని చెప్పడానికి.. ఈ అర్జున్ ఈగలే ఎగ్జాంపుల్.

నిజానికి.. గద్దలతో వేటాడటమనేది కొత్తగా కనుగొన్నేదేమీ కాదు. మన పురాణాల్లోనూ దీని గురించి ప్రస్తావన ఉంది. అదే.. జటాయువు. రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికీ.. అందులోని జటాయువు పాత్ర గురించి కచ్చితంగా తెలిసే ఉంటుంది. రామాణయంలోని అరణ్యకాండలో రావణాసురుడు సీతను ఎత్తుకొని వెళ్తున్నప్పుడు.. జటాయువు అతనికి అడ్డు తగులుతుంది. అతని నుంచి సీతను కాపాడేందుకు వీరోచితంగా పోరాడుతుంది. అయితే.. రావణుడు తన కత్తితో జటాయువు రెక్కలను నరికివేయడంతో అది ఓడిపోతుంది. శ్రీరామచంద్రునికి సీతాపహరణం గురించి చెప్పిన తర్వాత ప్రాణాలు విడుస్తుంది. జటాయువు ప్రాణ త్యాగానికి చలించిన శ్రీరాముడు.. తానే స్వయంగా ఆ పక్షిరాజుకి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాడు. అలా.. పురాణాల్లోనూ, మన పూర్వకాలంలోనూ.. డేగల పాత్ర కనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల కిందట భారత్‌లోనూ గద్దలను వేటకోసం వాడేవాళ్లు. ఇప్పుడదే సంప్రదాయం.. ఆర్మీకి కూడా చేరింది. ఆర్మీలో అద్భుతమైన శిక్షణ తీసుకున్న గద్దలు.. శత్రుదేశాల నుంచి దేశంలోకి వచ్చే డ్రోన్లను.. గాల్లోనే నాశనం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.