Indian Army: శత్రు దేశాల డ్రోన్లు కూల్చేయనున్న గద్దలు.. శిక్షణ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ

పాకిస్తాన్ నుంచి వరుసగా దూసుకొస్తున్న డ్రోన్లకు చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీ గద్దలను వినియోగించనుంది. దీనికోసం ఇప్పటికే వాటికి శిక్షణ ఇస్తోంది.

Indian Army: శత్రు దేశాల డ్రోన్లు కూల్చేయనున్న గద్దలు.. శిక్షణ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ

Indian Army: శత్రు దేశాల నుంచి వచ్చే డ్రోన్లను ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ సరికొత్త వ్యూహాన్ని అమలుచేయనుంది. డ్రోన్లను ఎదుర్కొనేలా గద్దలను తీర్చిదిద్దుతోంది. వాటికి శిక్షణ ఇస్తోంది. గద్దలతోపాటు కుక్కలకు కూడా దీనిపై శిక్షణ ఇస్తోంది. దూరంగా డ్రోన్లు ఎగురుతున్నట్లు కనిపిస్తే, గద్దలు వాటిని వెంటాడుతూ వెళ్లి కూల్చేస్తాయి.

Bihar: తెల్లారేసరికి మాయమైన రెండు కిలోమీటర్ల రోడ్డు.. గ్రామస్తుల ఆశ్చర్యం.. అసలేం జరిగింది?

దగ్గర్లో డ్రోన్లు ఉంటే కుక్కలు వాటిని పసిగడతాయి. పైన డ్రోన్లు ఎగురుతుంటే వాటి శబ్దాల్ని విని గుర్తిస్తాయి. వెంటనే సైన్యాన్ని అలర్ట్ చేస్తాయి. డ్రోన్లను కూల్చేందుకు ఇండియన్ ఆర్మీ గద్దల్ని వాడటం ఇదే మొదటిసారి. వీటికోసం గద్దలకు కొంతకాలంగా అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయ్యాక వీటిని మిలిటరీ కార్యకలాపాల్లో పూర్తిగా వినియోగిస్తారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని ఔలి ప్రాంతంలో యుద్ధ అభ్యాస్ పేరుతో భారత సైన్యం వివిధ విన్యాసాలు చేస్తోంది. మన సైన్యానికి సంబంధించిన నైపుణ్యాల్ని అక్కడ పరీక్షిస్తున్నారు. రెండు వారాలపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా గద్దల పనితీరును సైన్యం పరీక్షించింది. అర్జున్ అనే శిక్షణ పొందిన గద్దను సైనికులు పరీక్షించారు. దీని కోసం ఒక డ్రోన్‌ను ఎగరేశారు.

Karnataka: 205 కేజీల ఉల్లిపాయల్ని 8 రూపాయలకే అమ్మిన రైతు.. వైరల్ అవుతున్న రశీదు

దూరంగా ఎగురుకుంటూ వస్తున్న ఆ డ్రోన్‪ను గద్ద గాలిలోనే కూల్చివేసి, తిరిగి వచ్చింది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఇవి విజయం సాధిస్తున్నాయి. త్వరలోనే వీటిని పూర్తిస్థాయిలో వినియోగిస్తారు. ఇండియా-పాక్ సరిహద్దు గుండా పంజాబ్, జమ్ము-కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో పాక్ నుంచి డ్రోన్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి వాటిని ఎదుర్కొనే విషయంలో గద్దలు ఉపయోగపడతాయని ఇండియన్ ఆర్మీ భావిస్తోంది.