Kerala : మునుగుతున్న బోటు, మత్స్యకారులను ర‌క్షించిన కోస్ట్ గార్డ్స్

కేర‌ళ‌ రాష్ట్రంలోని క‌న్నూర్ తీర ప్రాంతంలో మ‌త్స్య‌కారులు చెందిన ఓ ప‌డ‌వ భ‌ద్రియ‌ ప్ర‌మాదానికి గురైంది.

Kerala : మునుగుతున్న బోటు, మత్స్యకారులను ర‌క్షించిన కోస్ట్ గార్డ్స్

Amid Cyclone

Indian Coast Guard : నడి సముద్రం..ఓ పడవ వెళుతోంది. అందులో మత్స్యకారులు ఉన్నారు. అకస్మాత్తుగా…పడవలోకి నీళ్లు వచ్చాయి. దీంతో ఏమి చేయాలో వారికి అర్థం కాలేదు. అర్థరాత్రి అయిపోయింది..ఇక చనిపోతామని భావించారు అంతా..కోస్ట్ గార్డ్స్ వీరిని రక్షించారు.

హమ్మయ్య..బతికినాంరా..జీవుడా..అని ఆ కోస్ట్ గార్డ్స్ కు ధన్యవాదాలు తెలియచేశారు. రక్షిస్తున్న దృశ్యాలు..వీడియోలో పోస్టు చేశారు. క్షణాల్లో తెగ వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం తౌటే తుఫాన్ వేగంగా వస్తున్న సంగతి తెలిసిందే. కేరళ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

కేర‌ళ‌ రాష్ట్రంలోని క‌న్నూర్ తీర ప్రాంతంలో మ‌త్స్య‌కారులు చెందిన ఓ ప‌డ‌వ భ‌ద్రియ‌ ప్ర‌మాదానికి గురైంది. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పడవ అడుగు భాగంలో చిల్లు పడడంతో అందులోకి నీళ్లు రావడం ప్రారంభించాయి. మ‌త్స్య‌కారులు దీన్ని గ‌మ‌నించి రక్షించాలని ఇండియ‌న్ కోస్ట్ గార్డ్స్ కోరారు. వెంటనే రంగంలోకి దిగి మత్స్యకారులను రక్షించారు. కోస్ట్ గార్డ్స్‌కు చెందిన విక్ర‌మ్ నౌక సాయంతో రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ప‌డ‌వ‌లోని ముగ్గురు మ‌త్స్య‌కారులను ర‌క్షించారు.

Read More : ఒక్క ఫోన్ చెయ్యండి.. ఆక్సిజన్ వచ్చేస్తుంది – సోనూసూద్