Indian Company: ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోంకు ఇచ్చిన ఇండియన్ కంపెనీ

ఇప్పటికే పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనుమతి ఇచ్చేశాయి. ఇదే సమయంలో తాము సైతం అంటూ ఇండియన్ కంపెనీ పేటీఎం కూడా ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునేందుకు అప్రూవల్ ఇచ్చింది.

Indian Company: ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోంకు ఇచ్చిన ఇండియన్ కంపెనీ

Work From Home

Indian Company: ఇప్పటికే పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనుమతి ఇచ్చేశాయి. ఇదే సమయంలో తాము సైతం అంటూ ఇండియన్ కంపెనీ పేటీఎం కూడా ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునేందుకు అప్రూవల్ ఇచ్చింది. కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ టెక్, బిజినెస్, ప్రొడక్షన్ వంటి అనేక విభాగాలలో వర్క్-ఫ్రమ్-హోమ్ ఓపెనింగ్‌లకు అనుతిస్తున్నట్లు తెలిపారు.

ట్విటర్‌‌లో ఈ విషయాన్ని ప్రకటించిన శర్మ.. కంపెనీ అందించబోయే ప్రోత్సాహకాల గురించి తెలియజేశారు. ఓపెనింగ్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరాడు. టెక్, వ్యాపారం, ప్రొడక్షన్ రోల్స్‌లోని ఉద్యోగులను ఇంటి నుండి లేదా వారు కోరుకున్న చోట నుండి పని చేయడానికి కంపెనీ అనుమతిస్తుందని చెప్పారు.

“Paytmలో ప్రొడక్షన్, టెక్నాలజీ, వ్యాపారం వంటి రోల్స్ కోసం ఇంటి నుండి/ఎక్కడైనా పని చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాం” అని Paytm వ్యవస్థాపకుడు ట్వీట్ చేశారు. అతను ఇల్లు, ఆఫీసు నుండి పనిచేసే వ్యక్తుల మధ్య సమాంతరంగా చిత్రీకరించిన యానిమేటెడ్ క్లిప్‌ను కూడా పోస్ట్ చేశాడు.

Read Also : వర్క్ ఫ్రమ్ హోం మాకొద్దు.. ఐటీ జాబ్స్ వదిలేస్తున్న మహిళలు…!

మరోవైపు, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, డెలాయిట్ వంటి కొన్ని సంస్థలు ఇంటి నుండి పని చేయడం లేదా ఆఫీసులకు తిరిగి వెళ్లాలనుకుంటే తుది నిర్ణయాన్ని వ్యక్తిగత బృందాలకు వదిలివేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. తమ ఉద్యోగులకు అవసరమైన వెసులుబాటును కల్పించేందుకు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.