Adani Meets Bangladesh PM : బంగ్లాదేశ్ ప్రధానితో గౌతం ఆదానీ భేటీ…

భార‌త‌ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బంగ్లాదేశ్ ప్ర‌ధాన మంత్రి షేక్ హ‌సీనాతో భార‌త పారిశ్రామిక దిగ్గ‌జం..ఆదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌతం ఆదానీ భేటీ అయ్యారు.

Adani Meets Bangladesh PM :  బంగ్లాదేశ్ ప్రధానితో గౌతం ఆదానీ భేటీ…

gautam adani meets bangladesh prime minister Sheikh Hasina

gautam adani meets bangladesh pm Sheikh Hasina : భార‌త‌ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బంగ్లాదేశ్ ప్ర‌ధాన మంత్రి షేక్ హ‌సీనాతో భార‌త పారిశ్రామిక దిగ్గ‌జం..ఆదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌతం ఆదానీ భేటీ అయ్యారు. భార‌త్ ప‌ర్య‌ట‌న కోసం ఆదివార‌ు (సెప్టెంబర్ 5,2022) షేక్ హ‌సీనా ఢిల్లీ చేరుకున్నవిషయం తెలిసిందే. మొదటిరోజు షేక్ హసీనా భార‌త రాష్ట్రప‌తి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఆ మ‌రునాడు (సోమ‌వారం) ప‌లువురు ప్ర‌ముఖుల‌తో హ‌సీనా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా గౌతం ఆదానీ ఆమెతో స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా బంగ్లాదేశ్ అభివృద్ధి ప‌ట్ల షేక్ హ‌సీనా విస్ప‌ష్ట వైఖ‌రితో ముందుకు సాగుతున్నార‌ని ఆదానీ అన్నారు. గొడ్డా ప‌వ‌ర్ ప్రాజెక్టు ద్వారా 1,600 మెగావాట్ల విద్యుదుత్ప‌త్తి, బంగ్లాదేశ్‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా లైను ఏర్పాటును ఆ దేశ విజ‌య్ దివ‌స్ అయిన డిసెంబ‌ర్ 16 నాటికి పూర్తి చేయ‌డానికి కృత నిశ్చ‌యంతో ఉన్న‌ామని ఆదానీ ప్ర‌క‌టించారు. భారతీయ బిలియనీర్ పారిశ్రామికవేత్త అదానీ ప్రధాన మంత్రి హసీనా ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

కాగా..బంగ్లాదేశ్ పవర్ డెవలప్ మెంట్ బోర్డు (బీపీడీబీ)కి డెడికేటెబ్ ్రటాన్స్ మెిషన్ లైన్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్ ను సరఫరా చేయటానికి అదానీ పవర్ ఝార్ఖండ్ లోని గొడ్డాలో 1600 మెగావాట్ల ధర్మల్ పవర్ ను ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ లో నాలుగు రోజులు పర్యటించనున్నారు. సోమవారం ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తో హసీనా భేటీ అయి దౌత్య సమావేశాలను ప్రారంభించారు.

షేక్‌ హసీనా భారత పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. మంగళవారం రాష్ట్రపతి భవన్‌‌కు చేరుకున్న షేక్‌ హసీనాకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. భారత ప్రధానితో చర్చల నిమిత్తం దేశ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాకి సగౌరవంగా త్రివిధ దళాల సైనిక వందనంతో ఆహ్వానం పలికారు. నాలుగు రోజుల భారత పర్యటన కొనసాగనున్న క్రమంలో బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా భారత ప్రధాని నరేంద్ర మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు.

కోవిడ్‌ కాలంలోనూ, ఉక్రెయిన్‌ రష్యా యుద్ధసమయంలోనూ భారత్‌ అందించిన సాయం గొప్పదని కొనియాడారు. ఇరుదేశాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నామని, ఇరు దేశాల ప్రజల అభివృద్ధి ఆకాంక్షతో సమైక్యంగా ముందుకు సాగుతామని షేక్‌ హసీనా అన్నారు. పీపుల్స్ ఫెడరేషన్, పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం తమ ప్రధాన కర్తవ్యమని హసీనా తెలిపారు. ఈ సమస్యలన్నింటిపై భారత్, బంగ్లాదేశ్ దేశాలు కలిసి పని చేస్తున్నాయని పేర్కొన్నారు. భారతదేశం – బంగ్లాదేశ్‌ సత్సంబంధాలతో దక్షిణ ఆసియా అంతటా ప్రజలకు మెరుగైన జీవనం లభిస్తుందని.. ఇదే తమ కర్తవ్యమని బంగ్లాదేశ్ ప్రధాని పేర్కొన్నారు.