Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. టికెట్ల బుకింగ్ లిమిట్ డబుల్..

ప్రయాణీకులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుండి రైల్వే ప్రయాణీకులు మరిన్ని టికెట్లు బుక్ చేసుకొనే అవకాశాన్ని కల్పించింది. ప్రయాణీకుల సౌకర్యార్థం ఇండియ‌న్ రైల్వే కేట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ (IRCTC) వెబ్‌సైట్, యాప్‌లో టికెట్ బుకింగ్ ల పరిమితిని పెంచింది.

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. టికెట్ల బుకింగ్ లిమిట్ డబుల్..

Indian Railways

Indian Railways: ప్రయాణీకులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుండి రైల్వే ప్రయాణీకులు మరిన్ని టికెట్లు బుక్ చేసుకొనే అవకాశాన్ని కల్పించింది. ప్రయాణీకుల సౌకర్యార్థం ఇండియ‌న్ రైల్వే కేట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ (IRCTC) వెబ్‌సైట్, యాప్‌లో టికెట్ బుకింగ్ ల పరిమితిని పెంచింది. ప్రస్తుతం ఆధార్ లింక్ చేయని యూజర్లు నెలలో గరిష్టంగా ఆరు టికెట్లు బుకింగ్ చేసుకొనే అవకాశం ఉంది. అదే ఆధార్ లింక్ చేసిన యూజర్లు 12 టికెట్లు బుక్ చేసుకొనే అవకాశం ఉంది. అయితే IRCTC ఇప్పటి వరకు ఉన్న టికెట్ల బుకింగ్ పరిమితిని డబుల్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Indian Railways : రైల్వే శాఖ కీలక నిర్ణయం..అదనపు లగేజీకి ప్రత్యేక రుసుము

రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. వినియోగదారుడు తన ఐడీ ద్వారా గతంకంటే ప్రస్తుతం ఎక్కువ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆధార్ లింక్ చేయని IRCTC యూజర్లు ఒక్కో ఐడీ ద్వారా నెలలో గరిష్ఠంగా 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అదే ఆధార్ లింక్ చేసిన యూజర్లు నెలలో 24 టికెట్లు బుక్ చేసుకొనే అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ కేటగిరీకి సంబంధించి షరతులు విధించింది. అంతేకాక యూజర్ ఐడీని ఆధార్ తో లింక్ చేసి, టికెట్ బుక్ చేసుకునే ప్రయాణీకుల్లో ఒకరి ఆధార్ ను వెరిఫై చేయాలని IRCTC ప్రకటించింది.

Indian Railways: భారత్ నుంచి నేపాల్, బంగ్లాదేశ్ లకు నేరుగా రైలు సేవలు

ఇదిలా ఉండగా భారతీయ రైల్వే ఈ ఏడాది దాదాపు 9,000 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. అందులో గత మూడు నెలల్లో బొగ్గు తరలింపు కారణంగా 1,900కు పైగా రైళ్లు రద్దయ్యాయని ఆర్టీఐ ప్రశ్నలో తేలింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టర్ ప్రకారం.. నిర్వహణ పనులు, నిర్మాణ ప్రయోజనాల కోసం 6,995 రైలు సర్వీసులు రద్దు చేయబడ్డాయి. అయితే బొగ్గు తరలింపు కారణంగా మార్చి నుండి మే వరకు 1,934 రైలు సర్వీసులు రద్దు చేయబడ్డాయి. అధికారుల వివరాల ప్రకారం.. తీవ్రమైన విద్యుత్ కొరత కారణంగా భారతీయ రైల్వేలు ప్యాసింజర్ రైలు సేవల కంటే బొగ్గు తరలింపుకు ప్రాధాన్యత ఇవ్వవలసి వచ్చింది.