Indian Railways : మార్చి 31 తర్వాత దేశవ్యాప్తంగా రైళ్లు రద్దు..? నిజమేంటంటే..

సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో ఫేక్ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. నిజం తెలిసేలోపు ఫేక్ న్యూస్ ఊరంటా చుట్టేస్తోంది. ఆ న్యూస్ జనాలను కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి. కంగారు పెట్టిస్తున్నాయి. వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఫేక్ న్యూస్ ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత అవి ఫేక్ అని తెలిసి జనాలు ఊపిరిపీల్చుకున్నారు.

Indian Railways : మార్చి 31 తర్వాత దేశవ్యాప్తంగా రైళ్లు రద్దు..? నిజమేంటంటే..

Cancellation Of Trains

cancellation of trains from 31 March misleading: సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో ఫేక్ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. నిజం తెలిసేలోపు ఫేక్ న్యూస్ ఊరంటా చుట్టేస్తోంది. ఆ న్యూస్ జనాలను కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి. కంగారు పెట్టిస్తున్నాయి. వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఫేక్ న్యూస్ ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత అవి ఫేక్ అని తెలిసి జనాలు ఊపిరిపీల్చుకున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్న ఈ సమయంలో మరో న్యూస్ వైరల్ గా మారింది. ఆ ప్రచారం జనాలను ఆందోళనకు గురి చేసింది. అదేమిటంటే.. దేశంలో ప్రస్తుతం నడుస్తున్న రైళ్లన్నీ నిలిపోనున్నాయట. మార్చి 31 తర్వాత దేశవ్యాప్తంగా రైళ్లన్నీ రద్దవుతాయట. ఇప్పుడీ న్యూస్ తెగ ప్రచారం అవుతోంది. జనాలు ఈ వార్త నిజమేమో అనుకుని కంగారు పడిపోయారు. ఈ న్యూస్ ని తెగ షేర్ చేశారు.

చివరికి వ్యవహారం కేంద్ర రైల్వేశాఖ వరకు చేరింది. దీనిపై కేంద్ర రైల్వే శాఖ వెంటనే స్పందించింది. అది ఫేక్ న్యూస్ అని రైల్వేశాఖ స్పష్టం చేసింది. అందులో నిజం లేదని, అదంతా తప్పుడు ప్రచారం అని తేల్చి చెప్పింది. వాస్తవానికి గతేడాది(2020) వార్తను ఇప్పుడు సర్కులేట్ చేస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లన్నీ(ఎక్స్ ప్రెస్, స్పెషల్, సబ్ అర్బన్ రైళ్లు) యథావిథిగా నడుస్తాయని వివరించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులు ప్రయాణాలు చేయాలని రైల్వే శాఖ సూచించింది.