Short-Form Videos: షార్ట్ వీడియోలకు పెరుగుతున్న ఆదరణ.. దేశంలో 8 కోట్ల కంటెంట్ క్రియేటర్లు.. వీరి నెల సంపాదన ఎంతో తెలుసా?

దేశంలో షార్ట్ వీడియోస్‌కు పాపులారిటీ పెరుగుతోంది. దీంతో కంటెంట్ క్రియేటర్స్ కూడా పెరుగుతున్నారు. ప్రస్తుతం దేశంలో 8 కోట్ల మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు.

Short-Form Videos: షార్ట్ వీడియోలకు పెరుగుతున్న ఆదరణ.. దేశంలో 8 కోట్ల కంటెంట్ క్రియేటర్లు.. వీరి నెల సంపాదన ఎంతో తెలుసా?

Short-Form Videos ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌తోపాటు పలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై బోలెడంత కంటెంట్ క్రియేట్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ కాలంలో వీటి ద్వారా షార్ట్ వీడియోస్ బాగా పాపులర్ అవుతున్నాయి.

Viral Video: సఫారి వాహనంలోకి ఎగిరి దూకిన సింహం.. సందర్శకులకు సరికొత్త అనుభూతి.. ఇంతకీ సింహం ఏం చేసిందంటే

చాలా మంది కంటెంట్ క్రియేట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 8 కోట్ల మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారట. బెంగళూరుకు చెందిన రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ సర్వే ప్రకారం.. షార్ట్ వీడియో యాప్స్ పాపులారిటీ బాగా పెరుగుతోంది. దేశంలో మొత్తం 8 కోట్ల మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. వీరిలో కంటెంట్ క్రియేటర్స్ 1.5 లక్షల మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది నెలనెలా ఆదాయం పొందుతున్నారు. సగటున రూ.16,000-2,00,000 వరకు ఆదాయం సంపాదిస్తున్నారు. మొత్తం క్రియేటర్లతో పోలిస్తే వీరిలో ఆదాయం పొందుతున్నది మాత్రం 1 కంటే తక్కువ శాతమే. ఒక ప్రొఫెషనల్ షార్ట్ వీడియో క్రియేటర్స్‌లో దాదాపు 50,000 మంది లోకల్ యాప్స్ వాడుతున్నారు.

Viral Video: చెల్లికి అన్న సర్‌ప్రైజ్ గిఫ్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న చెల్లెలు.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో

వీరికి 40 శాతం మంది వినియోగదారులు మెట్రో నగరాలకు చెందిన వాళ్లైతే, మిగతా వాళ్లు నాన్ మెట్రో ఆడియెన్స్. దేశంలోని వినియోగదారుల్లో స్మార్ట్‌ఫోన్లలో ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ ఎక్కువగా చూస్తున్నారు. సగటున రోజుకు 156 నిమిషాలు దీనికోసం వెచ్చిస్తున్నారు. సగటున 38 నిమిషాలపాటు షార్ట్ వీడియోస్ చూస్తున్నారు. కాగా, 2025కల్లా ఈ యాప్స్ వినియోగదారులు రెట్టింపయ్యే అవకాశం ఉంది. అంటే 60 కోట్లకు చేరుకోవచ్చు. అలాగే 2030 కల్లా ఈ వ్యాపారం విలువ 19 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు.