Kerala: దేశంలోనే తొలి శానిటరీ నాప్‌కిన్ ఫ్రీ గ్రామం

కేరళలోని ఎర్నాకులం జిల్లా కుంబలంగి గ్రామం దేశంలోనే తొలి శానిటరీ నాప్‌కిన్ ఫ్రీ గ్రామంగా పేరుకెక్కింది.హిందూస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. మూడు నెలలుగా బాలికలు, యువతులకు...

Kerala: దేశంలోనే తొలి శానిటరీ నాప్‌కిన్ ఫ్రీ గ్రామం

Kerala: కేరళలోని ఎర్నాకులం జిల్లా కుంబలంగి గ్రామం దేశంలోనే తొలి శానిటరీ నాప్‌కిన్ ఫ్రీ గ్రామంగా పేరుకెక్కింది. హిందూస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. మూడు నెలలుగా బాలికలు, యువతులకు 5వేల మెన్‌స్ట్రువల్ కప్స్ పంపిణీ చేశారు. అవల్‌కాయీ అనే కాంపైన్ లో భాగంగా వాటి వల్ల ఉపయోగాలను కూడా వివరించారు.

కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. కుంబలంగీ గ్రామం దేశంలోని మిగతా గ్రామాలకు రోల్ మోడల్ గా మారిందని అన్నారు. ఇటువంటి స్కీంలు మహిళా సాధికారత పెంపొందించేందుకు సహాయపడతాయి. ముందుగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని వివరించారు గవర్నర్.

ఎర్నాకులం పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా అవాల్కాయీ కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీ హీబీ ఈడెన్ వివరించారు. చాలా స్కూళ్లలో నాప్ కిన్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేశాం. కానీ, అవెప్పుడూ సమస్యలు సృష్టిస్తూనే ఉండేవి. అప్పుడే ఈ ఐడియా వచ్చింది. నిపుణుల సలహాలు పాటించాం. కప్ లను కొన్ని సంవత్సరాల వరకూ వాడుకోవచ్చని’ చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో 4నెలల్లో 3కోట్ల వ్యాక్సినేషన్లు