Strange village : ఆ గ్రామంలో ఎవ్వరికి పేర్లు ఉండవ్..ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో తెలుసా..!!

ఆ గ్రామంలో ఎవ్వరికి పేర్లు ఉండవ్. కానీ ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో తెలిస్తే ఆశ్చర్యపోతాం. వారి క్రియేటివిటీకి నిజంగా హ్యాట్సాఫ్ చెబుతాం.

Strange village : ఆ గ్రామంలో ఎవ్వరికి పేర్లు ఉండవ్..ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో తెలుసా..!!

India’s Whistling Village

India’s Whistling Village : ఎ వరైనా సరే తమకు బిడ్డ పుడితే ఏం పేరు పెట్టాలి?అని ఆలోచిస్తారు.తమ ఇంట్లో పెద్దవారి పేరో..లేదా దేవుడి పేరో లేదా చక్కటి అర్థం వచ్చే పేరు పెట్టాలని ఆలోచిస్తారు. కానీ పేరు పెట్టాల్సిన పనే లేకపోతే..ఇక ఎందుకు ఆలోచన..అదేంటీ..ఏదోక పేరు పెట్టాలి కదా..పెట్టకపోతే ఎలా? వారిని ఏమని పిలుస్తాం? బడిలో ఏపేరు రాయిస్తాం? అంటారా? అస్సలు పేరు పెట్టకపోతే ఎలా? అనే పెద్ద ఆలోచన వచ్చే ఉంటుంది కదా..నిజమే ఏదోక పేరు పెట్టాలి కదా..కానీ ఓ గ్రామంలో నివసించే ప్రజలు ఎవ్వరికి ‘పేర్లు’ ఉండవ్..!! నిజమే..700కి పైగా జనాభా కలిగిన ఆ గ్రామంలో ఎవ్వరికి పేర్లు ఉండవ్..మరి ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..ఈ గ్రామం ఎక్కడో కాదు మన భారతదేశంలోనే కావటం మరో విశేషం..!! ఆ వింత గ్రామం పేరు ‘కాంగ్‌థాన్‌’..!!

విజిల్స్ విలేజ్..
ప్రకృతి నేల మేఘాలయాలోని ఈస్ట్‌ ఖాసి జిల్లాలో ఉంది ఈ కాంగ్‌థాన్‌ అనే గ్రామం. జనాభా 700కు పైనే. ఈ గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. అదే ఎవ్వరకి పేర్లు పెట్టకపోవటం.మరి ఎలా పిలుచుకుంటారంటే ‘ఈల’వేసి పిలుచుకుంటారు. ఈల వేసి పిలిస్తే మనకు అదో పెద్ద తప్పు. కానీ వీరికి అది సర్వసాధారణం. ‘ఈల’వారి పేరు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ‘ఈల’ ఉంటుంది.అదే వారి పేరు. ఈల వారి పూర్వీకులనుంచి సంప్రదాయంగా వస్తున్న ఆచారమట.కాంగ్‌థాన్‌కు ఎవరన్నా కొత్తవారు వస్తే..ఏదోకమూల నుంచి ఈల వినిపిస్తుంది. అది వినిపించింది అంటే ఎవరో ఎవరినో పిలుస్తున్నట్లు అన్నమాట. మరి అందరి పేరు ఈల ఒకలా ఉండకపోవటం వీరి ప్రత్యేకత. పక్షుల అరుపులు, సినిమా పాటల్లోని ట్యూన్ల ఆధారంగా అక్కడ పిల్లలకు పేర్లు పెడతారు.

Read more : No rain village : వర్షం ప‌డ‌ని గ్రామం..! మేఘాలకు పైన ఉండే వింత ప్రాంతం..!

అంతేకాదు వారికి చిన్నప్పటి నుండే పదాలు పలకడానికి బదులు సీటీలు (ఈలలు) కొట్టడం, శబ్దాలు చేయడం, పాటలు పాడటం నేర్పిస్తారట. మన దగ్గర ఎవరైనా రోడ్డు మీద పోయేటప్పుడు ఈల కొడితే వాళ్ళను ఇరగ్గొడతారు.ఒళ్లు వాయగొడతారు. ‘ఏంట్రా ఈల వేసి పిలుస్తున్నావ్..ఒళ్లు ఎలా ఉంది?’ అని నిలదీస్తాం..అసవరమైతే రెండు తగిలిస్తాం.కానీ ఈల కొట్టడం అంత తప్పుగా భావిస్తాము. కానీ కాంగ్‌థాన్‌లో మాత్రం పిల్లాడు సీటీ కొడితే అతడు పెద్దవాడు అవుతున్నట్లుగా భావిస్తారట. ఈల వేసిన కొడుకుని చూసి ఆనందంతో తల్లితండ్రులు ఆ పిల్లాడిని గుండెలకు హత్తుకుంటారట.

విజిల్స్ వేయటంలో అక్కడివారు సిద్ధహస్తులు.చిన్నప్పటినుంచి నేర్పిస్తారు. మన సమాజంలో ఒకే పేరు చాలామందికి ఉంటుంది. కానీ ఈల కాంగ్‌థాన్‌లో మాత్రం ఒకరికి కేటాయించిన శబ్దం (ఈల) ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరికి పెట్టరట. అదే వారి స్పెషాలిటి. వారి ఈల పేర్లకు వెనుక ఎంతటిక్రియేటివిటీ ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఆ గ్రామంలో ఎవరికైనా బిడ్డ పుడితే ఆ బిడ్డకు ‘ఈల’ పెట్టటానికి అదేనండీ పేరు పెట్టటానికి ఓ తతంగమే ఉంటుంది. ఆ బిడ్డ తండ్రి కొత్త సీటీ (ఈల) పాడి వినిపిస్తే, తల్లి ఒక శబ్దం వినిపిస్తదట. పెద్ద మనుషులంతా కలిసి తల్లితద్రులు ఇచ్చిన ఈల శబ్దాలను జోడించి ఫైనల్‌ గా ఒక ఈల అదే ఒక శబ్దాన్ని నిర్ణయిస్తారట. ఈ కొత్త ఈల శబ్దమే ఆ బిడ్డకు పేరు అవుతుంది. అదే పేరు అవుతుంది.

Read more : ఆ ఊరంతా గవర్నమెంట్ ఉద్యోగులే…ఒక్కో ఇంటిలో ఇద్దరు ముగ్గురు

అసలు అన్ని ఈల శబ్దాలు వాళ్లకు ఎలా గుర్తుంటాయో ప్రతీసారి కొత్త శబ్దాన్ని ఎలా క్రియేట్ చేస్తారో అవన్నీ ఎలా గుర్తు పెట్టుకుంటరో అనిపిస్తుంది. కొత్తగా పుట్టిన వాళ్లకోసం 30 సెకన్ల నిడివితో ఒక ప్రత్యేకమైన విజిల్‌ను రూపొందించి దాన్నే పేరుగా పెడతారు. అంటే వాళ్ల ఈల క్రియేటివిటీ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే… మనం వెంకటేశ్వర్లు అనో రామారావు అనో..అని పేర్లు పెట్టుకుని వారిని వెంకీ, రాము అని అని పిలుచుకుంటామో, వాళ్ళు కూడా అలాగే బయట ఉన్నప్పుడు మాత్రమే ఈ 30 సెకన్ల సీటీతో పిలుస్తారట. అదే ఇంట్లో ఉంటే ఆరు సెకన్ల విజిల్‌తో పిలుస్తారట.

జోల పాట కూడా ఈలపాటే..
ఇలా ఈల శబ్దాలతో పేర్లు పెట్టడాన్ని ‘జిగవా యోబి’ అంటారు. అంటే వారి భాషలో ‘అమ్మ ప్రేమ’ అని అర్థం. ఆ సీటీల శబ్దాలతోనే వాళ్లు మనుషులను అర్థం చేసుకుంకుంటారట. ఒక ఇంట్లో పదిమంది ఉంటే పది రకాల సీటీలు ఉంటాయట. అంతేకాదు మన పెద్దలు మనకు జోలపాట పాడి నిద్రపుచ్చినట్టే వీళ్ల పూర్వీకులు సీటీలద్వారా ప్రత్యేక ట్యూన్లు కట్టి పిల్లలను లాలించే వారట. అలా ఎన్నో రకాల ట్యూన్‌లతో లాలించే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది అంటే వారు వారి సంప్రదాయానికి ఇస్తున్న విలువ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

కాంగ్‌థాన్‌ కొండల మధ్య ఉంటుంది. అందంగా కనువిందు చేస్తుంది.అడవికి వెళ్లిన వాళ్లు ఊరు చేరుకోవడానికి సరైన మార్గం లేదు. 10 కి.మీ. ట్రెక్కింగ్‌ చేయాల్సిందే. వ్యవసాయమే వారి జీవనాధారం. వారం, పది రోజులకు ఒకసారి మాత్రమే అంగడికి వెళ్లి, పొలంలో పండించిన కూరగాయలను అమ్మి కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటారు. అడవిలో ఎవరైనా తప్పిపోతే, తమ పేరును గట్టిగా పాటలాగా పాడుతారట. అది విన్నవాళ్లు వచ్చి కాపాడతారు. సాయంగా వెళ్లిన వాళ్లూ… ఒకరినొకరు సీటీల ద్వారానే పలుకరించుకుంటారు.

Read more : భారత్ లో భోజనం చేసి మయన్మార్ లో నిద్ర..ఆ ఇల్లే ఓ ప్రత్యేకం

ఇక ఇక్కడి ప్రజలు బయటి వాళ్లతో పెద్దగా కలవరు. వీళ్లలో పెద్దగా చుదువుకున్న వాళ్లు కూడా లేరు. ఇప్పటి వరకు ఈ ఊరి నుండి ఆరుగురంటే ఆరుగురు మాత్రమే ఉన్నత చదువులకోసం ఊరు దాటారు అంటే అర్థమవుతుంది అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో. కాంగ్‌థాన్‌ ప్రజల ఈ వింత ఆచారమే అక్కడికి పర్యాటకు వచ్చేలా చేస్తోంది. విదేశాల నుంచి రీసెర్చ్ ల కోసం స్టూడెంట్స్ కాంగ్ థాన్ కు వస్తుంటారు. వారి జీవన విధానం గురించి అధ్యయనం చేయటానికి.వారి సీటీల గురించి తెలుసుకోవటానికి..