తప్పించుకోలేరు : మాస్కుకు పెట్టుకోకపోతే 50 పుష్ అప్స్ ..పనిష్మెంట్

తప్పించుకోలేరు : మాస్కుకు పెట్టుకోకపోతే 50 పుష్ అప్స్ ..పనిష్మెంట్

Indonesia Corona Rules in Bali : కరోనా మహమ్మారి వల్ల మాస్కులు ధరించటం తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. లేదంటే జరిమానాలు తప్పవని హెచ్చరికల్ని వింటూనే ఉన్నాం. మాస్కులు పెట్టుకోకపోతే..గంజిళ్లు తీయించటం..కరోనాతో చనిపోయినవారి కోసం సమాధులకు గోతులు తవ్వించటం వంటి ఎన్నో శిక్షల గురించి విన్నాం. కానీ ఇండోనేషియాలో మాస్కులు ధరించనివారికి అధికారులు కొత్త శిక్షలు అమలుచేస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగేవారు జరిమానా కట్టాలి. అలా కట్టలేనివారు ‘‘50 పుష్ అప్స్’’తీయాలి. అది రూల్ . ఇండోనేషియా దేశస్తులకే కాకుండా అక్కడకు వచ్చే టూరిస్టులకు కూడా ఇదే పన్మిష్మెంట్ విధిస్తున్నారు అధికారులు.

ఇండోనేషియాలోని రిసార్ట్ ద్వీపమైన బాలిలో మాస్కు ధరించనివారికి విధించిన ఈ వింత శిక్ష ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇండోనేషియాలో మాస్కు లేకుండా బయటకు వస్తే జరిమానా చెల్లించాలి. జరిమానా కట్టలేనివారు 50 పుష్-అప్స్ చేయాలని కొత్త శిక్ష అమలు చేస్తున్నారు. అలాగే మాస్కు ఉన్నా, సరిగ్గా ధరించనివారికి 15 పుష్ అప్స్ శిక్షగా ఉంది.

ఇండోనేషియాకు టూరిస్టులుగా వచ్చే యూరోపియన్ టూరిస్ట్‌లతో వైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీంతో మాస్కు ధరించని టూరిస్ట్‌లకు కూడా అధికారులు పుష్ అప్స్ శిక్ష విధిస్తున్నారు. ఈ వింత శిక్షలపై ఇండోనేషియా భద్రతా అధికారి గుస్టి అగుంగ్ కేతుట్ సూర్యనేగర మాట్లాడుతూ..ఫేస్ మాస్కులు లేకుండా చాలా మంది విదేశీయులు పట్టుబడ్డారని..ఇలా పట్టుబడిన వారిలో చాలామంది తమకు ఈ రూల్స్ తెలియవని చెప్పారని..మరికొంతమందే మర్చిపోయామని..ఇంకొందరు మాస్క్ చిరిగిపోయిందని చెప్పారని తెలిపారు.

కానీ మర్చిపోయినా..చినిగిపోయిదని సాకులు చెప్పినా..మరేవిధంగానైనా మాస్కులు పెట్టుకోకపోతే శిక్ష అనుభవించాల్సిందేనంటున్నారు. అలా 70 మంది 1,00,000 ఇండోనేషియా రూపాయలు (7 డాలర్లు) జరిమానా చెల్లించారు. మరో 30 మంది విదేశీయులు తమ వద్ద డబ్బు లేదని చెప్పారు. దీంతో వారిని పుష్ అప్స్ చేయమని ఆదేశించారు. జరిమానా విధించిన వారిలో 80 శాతం యూరోపియన్లేనని సుస్టి అగుంగ్ తెలిపారు.

Indonesia Corona Rules in Bali

కరోనా కష్టం వచ్చి ఇంత కాలం అయినా సరే ప్రజలు మాస్కులు పెట్టుకోవటంలో నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. బయటకు వచ్చేవారు తప్పనిసరిగా ఫేస్ మాస్క్‌లు ధరించాలని బాలి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ దేశంలో 9,17,000 వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. 26,000 మందికి పైగా చనిపోయారు. దీంతో నియమాలు పాటించని వారికి పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తున్నారు. ఇంతకు ముందు కూడా మాస్కు ధరించనందుకు ఇక్కడి అధికారులు కొత్త శిక్షలు విధించారు. పాడుబడ్డ ఇళ్లలో పెట్టి తాళాలు వేయడం, కోవిడ్-19తో చనిపోయిన వారికోసం సమాధులు తవ్వించడం వంటి శిక్షలు విధించారు. ఇప్పుడు కొత్తగా పుష్ అప్స్ చేయిస్తున్నారు.