IndVsEng 3rd T20I : సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీ వృథా.. మూడో టీ20లో పోరాడి ఓడిన భారత్

ఇంగ్లండ్‌ తో నామమాత్రపు మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది. సూర్యకుమార్ యాదవ్ సెంచరీ బాదినా భారత్ కు పరాజయం తప్పలేదు.

IndVsEng 3rd T20I : సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీ వృథా.. మూడో టీ20లో పోరాడి ఓడిన భారత్

Indvseng 3rd T20i

IndVsEng 3rd T20I : నాటింగ్ హామ్ లో ఇంగ్లండ్‌ తో నామమాత్రపు మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది. సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీ బాదినా భారత్ కు పరాజయం తప్పలేదు. ఇంగ్లండ్ నిర్దేశించిన 216 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులే చేసింది. విజయానికి 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

Virat Kohli : కోహ్లీపై కపిల్‌ దేవ్ షాకింగ్ కామెంట్స్.. జట్టులో విరాట్‌ను ఎందుకు తప్పించకూడదు..!

ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో సూర్యకుమార్ ఔట్ కావడం భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది. జోర్డాన్‌ వేసిన చివరి ఓవర్‌లో హర్షల్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌ ఔటయ్యారు. దీంతో ఇంగ్లండ్‌ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.

భారత బ్యాటర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌(117) చెలరేగిపోయాడు. విధ్వంసక బ్యాటింగ్ చేశాడు. సెంచరీతో కదం తొక్కాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ 55 బంతుల్లో 117 పరుగులు చేయడం విశేషం. అతడి స్కోర్ లో 14ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినా ప్రయోజనం లేకపోయింది.

T20 team: భార‌త్‌కు ‘ప‌వ‌ర్ హౌస్‌’లాంటి క్రికెట్ జ‌ట్టు ఉంది: ఆష్లీ జిలెజ్

మొయిన్‌ అలీ వేసిన 18.5 ఓవర్‌కు భారీ షాట్‌ ఆడబోయి ఫిలిప్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్ కు ఓటమి తప్పలేదు. శ్రేయస్‌(28), రోహిత్‌(11), కోహ్లీ(11) తప్ప ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. పంత్ (1), దినేశ్ కార్తీక్ (6), రవీంద్ర జడేజా (7) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే మూడు వికెట్లు పడగొట్టాడు. డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్ తలో రెండు వికెట్లు తీశారు. గ్లీసన్, మొయిన్ చెరో వికెట్ తీశారు.

చివరి టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ చెలరేగిపోయారు. భారత బౌలర్లను ఎడాపెడా బాదేశారు. పరుగుల వరద పారించారు. డేవిడ్ మలాన్ హాఫ్ సెంచరీతో విరుచుకుపడగా, లియామ్ లివింగ్ స్టోన్ రెచ్చిపోయాడు. డేవిడ్ మలాన్ (39 బంతుల్లో 77 రన్స్), లియామ్ లివింగ్ స్టోన్ (29 బంతుల్లో 42 పరుగులు) ధాటిగా ఆడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసింది. మలాన్ స్కోరులో 6 ఫోర్లు, 5 భారీ సిక్సులు ఉన్నాయి. లివింగ్ స్టోన్ 4 సిక్సులు బాదాడు. ఆఖర్లో హ్యారీ బ్రూక్ ( 9 బంతుల్లో 19 పరుగులు 3 ఫోర్లు), క్రిస్ జోర్డాన్ (3 బంతుల్లో 11 పరుగులు 1 ఫోర్, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కాగా, మూడు మ్యాచ్ ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో ఇప్పటికే కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ లో విజయం ఇంగ్లండ్ కు ఊరట అని చెప్పాలి. ఇక ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జులై 12న ప్రారంభం కానుంది.