IndiavsEngland: మ్యాచ్‌పై పట్టు బిగిస్తున్న భారత్.. 250 దాటిన ఆధిక్యం

బర్మింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ (5వ టెస్ట్) మ్యాచ్ లో టీమిండియా పట్టు సాధించే దిశగా సాగుతోంది. భారత్ ఆధిక్యం 200 పరుగులు దాటింది.(IndiavsEngland)

IndiavsEngland: మ్యాచ్‌పై పట్టు బిగిస్తున్న భారత్.. 250 దాటిన ఆధిక్యం

Indvseng 5th Test

IndvsEng 5th Test : బర్మింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ (5వ టెస్ట్) మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగిస్తోంది. భారత్ ఆధిక్యం 250 పరుగులు దాటింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. పుజారా హాఫ్ సెంచరీతో(50*) మెరిశాడు. మరో ఎండ్ లో సెంచరీ హీరో పంత్ (30*) క్రీజులో ఉన్నాడు. దీంతో భారత్ 257 పరుగుల లీడ్ సాధించింది. టీమిండియా మరో 150 నుంచి 200 పరుగులు చేసినా చాలు.. ఇంగ్లండ్ ముందు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిలిపే అవకాశముంటుంది.(IndiavsEngland)

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

సెకండ్స్ ఇన్నింగ్స్ లో భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అండర్సన్‌ వేసిన తొలి ఓవర్‌లోనే శుభ్‌మన్‌గిల్ (4) గిల్ ఔటయ్యాడు. ఆపై విహారి, పుజారా నిలకడగా ఆడి మరో వికెట్ పడకుండా రెండో సెషన్‌ను పూర్తి చేశారు. అయితే, టీ విరామం అనంతరం మ్యాచ్‌ ప్రారంభమైన కాసేపటికే స్టువర్ట్‌బ్రాడ్‌ వేసిన 17వ ఓవర్‌లో విహారి (11) ఔటయ్యాడు. దీంతో టీమ్‌ఇండియా 43 పరుగుల వద్ద రెండో వికెట్‌ నష్టపోయింది. 75 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లి 20 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.(IndiavsEngland)

దీంతో విరాట్‌ కోహ్లీ మరోసారి నిరాశపర్చాడు. బెన్‌స్టోక్స్‌ వేసిన 29.5 ఓవర్‌కు కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వగా అది చేజారింది. అయితే, పక్కనే ఉన్న జోరూట్‌ ఆ బంతిని అందుకోవడంతో విరాట్‌ వెనుదిరగక తప్పలేదు.

Rishabh Pant: ఇండియా బెస్ట్ వికెట్ కీపర్ – బ్యాటర్ రిషబ్ పంతేనట

టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 284 పరుగులకు ఆలౌటైంది. జానీ బెయిర్‌ స్టో సెంచరీతో మెరిశాడు. 140 బంతుల్లో 106 పరుగులు చేసి జట్టుని ఆదుకున్నాడు.(IndiavsEngland)

Jasprit Bumrah: బ్రియాన్ లారా వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా

ఇంగ్లండ్ ఓ దశలో 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బెయిర్ స్టో దూకుడుతో ఇంగ్లండ్ కోలుకుంది. ప్రతికూల పరిస్థితుల్లో బరిలోకి దిగిన బెయిర్ స్టో 119 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు. బెయిర్ స్టో స్కోర్ లో 14 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ఇటీవల న్యూజిలాండ్ లో సిరీస్ లోనూ రెండు సెంచరీలు బాదిన బెయిర్ స్టో.. వరుసగా మరో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. కాగా, సెంచరీ చేసిన కాసేపటికే బెయిర్ స్టో ఔటయ్యాడు. బెయిర్ స్టోను షమీ పెవిలియన్ పంపాడు. భారత బౌలర్లలో సిరాజ్‌ 4 వికెట్లు తీశాడు. బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. షమీ 2 వికెట్లు, శార్దూల్‌ 1 వికెట్‌ తీశారు.