IndvsEng 2nd T20 : రెండో టీ20లోనూ భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం

ఇంగ్లండ్ తో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ అదరగొట్టింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

IndvsEng 2nd T20 : రెండో టీ20లోనూ భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం

Indvseng 2nd T20

IndvsEng 2nd T20 : ఇంగ్లండ్ తో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ అదరగొట్టింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 171 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ ను భారత బౌలర్లు 121 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 49 పరుగుల తేడాతో రోహిత్ సేన గెలుపొందింది.

Virat Kohli : కోహ్లీపై కపిల్‌ దేవ్ షాకింగ్ కామెంట్స్.. జట్టులో విరాట్‌ను ఎందుకు తప్పించకూడదు..!

ఇంగ్లండ్ బ్యాటర్లలో మొయిన్‌ అలీ (35), డేవిడ్‌ విల్లే (33*) మినహా ఎవరూ పెద్దగా ఆడలేదు. భారత బౌలర్లలో భువనేశ్వర్ మూడు వికెట్లు తీశాడు. బుమ్రా, యుజువేంద్ర చాహల్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. హార్దిక్‌ పాండ్యా, హర్షల్‌ పటేల్‌ చెరో వికెట్‌ తీశారు. భారత బ్యాటర్లలో ఆల్‌రౌండర్‌ జడేజా (46*) రాణించాడు. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే. 2-0 తేడాతో టీ20 సిరీస్‌ కైవసం చేసుకుంది భారత్.

Arshdeep Singh: అరంగ్రేటంలోనే అదరగొట్టేశాడు.. 16ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన భారత యువ బౌలర్

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (31), కీపర్‌ పంత్‌ (26) అదిరే ఆరంభం ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన విరాట్‌ (1), సూర్యకుమార్‌ (15), హార్దిక్‌ పాండ్యా (12), దినేశ్‌ కార్తీక్‌ (12), హర్షల్‌ పటేల్‌ (13) పరుగులు చేశారు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. 29 బంతుల్లో 46* పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చివరి వరకూ క్రీజులో నిలబడ్డాడు. ఇంగ్లండ్‌ కు భారత్ ఆ మాత్రం టార్గెట్ నిర్దేశించడానికి కారణం జడేజానే. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్‌ నాలుగు వికెట్లు తీశాడు. రిచర్డ్‌ గ్లీసన్‌ 3 వికెట్లు పడగొట్టాడు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw