IndVsIreland 2ndT20I : సెంచరీ బాదిన దీపక్ హుడా.. ఐర్లాండ్ ముందు భారీ లక్ష్యం

ఐర్లాండ్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు చెలరేగారు. దీపక్ హుడా సెంచరీతో కదంతొక్కాడు. ఓపెనర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది.

IndVsIreland 2ndT20I : సెంచరీ బాదిన దీపక్ హుడా.. ఐర్లాండ్ ముందు భారీ లక్ష్యం

Indvsireland 2ndt20i

IndVsIreland 2ndT20I : ఐర్లాండ్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు చెలరేగారు. దీపక్ హుడా సెంచరీతో కదంతొక్కాడు. ఓపెనర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఐర్లాండ్ ముందు 228 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

దీపక్ హుడా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. 57 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 9 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. సంజూ శాంసన్ 42 బంతుల్లో 77 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 4 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. ఇషాన్ కిషన్(3), సూర్య కుమార్ యాదవ్(15), హార్దిక్ పాండ్య(15) పరుగులు చేశారు. దినేష్ కార్తిక్, అక్షర్ పటేల్ డకౌట్ అయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ మూడు వికెట్లు తీశాడు. జోష్ లిటిల్, క్రైగ్ యంగ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Virat Kohli: విరాట్ చివరిగా సెంచరీ చేసిన సంగతి నాకైతే గుర్తు లేదు – సెహ్వాగ్

ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో.. తొలి మ్యాచ్‌ గెలిచి జోరు మీదున్న టీమిండియా.. చివరి పోరులోనూ చెలరేగి సిరీస్‌ కైవసం చేసుకోవాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం చలాయించిన హార్దిక్‌ సేన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.

Hardik Pandya: కొత్త ఇండియన్ రికార్డు నెలకొల్పిన హార్దిక్ పాండ్యా

ఐర్లాండ్ తో రెండో టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు దీపక్ హుడా, సంజూ శాంసన్ చరిత్ర సృష్టించారు. ఇద్దరూ కలిసి రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో వికెట్ కి 176 పరుగుల పార్టనర్ షిప్ అందించారు. టీ20ల్లో భారత జట్టుకు ఇదే అత్యధికం. గతంలో శ్రీలంకపై 2017లో రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ 165 పరుగులు చేశారు. అంతకుముందు రోహిత్-ధావన్ 160, రోహిత్-ధావన్ 158 రన్స్ చేశారు.