IndvsWI 1st T20 : రాణించిన రోహిత్, దంచికొట్టిన డీకే.. భారత్ భారీ స్కోర్

వెస్టిండీస్ తో తొలి టీ20 మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరవగా, చివర్లో దినేశ్ కార్తీక్ దంచికొట్టాడు. దీంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది.

IndvsWI 1st T20 : రాణించిన రోహిత్, దంచికొట్టిన డీకే.. భారత్ భారీ స్కోర్

Indvswi 1st T20

IndvsWI 1st T20 : వెస్టిండీస్ తో తొలి టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు చెలరేగారు. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరవగా, చివర్లో దినేశ్ కార్తీక్ దంచికొట్టాడు. దీంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 64 పరుగులు చేశాడు. చివర్లో దినేశ్ కార్తీక్ దూకుడుగా ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

సూర్యకుమార్ యాదవ్ 24, పంత్ 14, జడేజా 16 పరుగులు చేశారు. శ్రేయస్ అయ్యర్ డకౌట్ అయ్యాడు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు తీశాడు. ఒబెద్ మెక్ కాయ్, జాసన్ హోల్డర్, అకీల్ హోసీన్, కీమో పాల్ చెరో వికెట్ పడగొట్టారు.

India vs West Indies: టీ20 సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ ఔట్‌

రోహిత్‌ శర్మ హాఫ్ సెంచరీతో మెరవగా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. అయితే, చివర్లో దినేశ్ కార్తీక్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ ( 10 బంతుల్లో 13 పరుగులు ) మెరుపు ముగింపునిచ్చారు. దీంతో భారత్‌ భారీ స్కోర్‌ సాధించింది.

వీరిద్దరూ చివరి 25 బంతుల్లో 52 పరుగులు చేయడం విశేషం. మరోవైపు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు (3,443) చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలవడమే కాకుండా 27వ అర్ధ శతకం సాధించాడు. ఈ క్రమంలోనే అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్న న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ మార్టిన్‌ గప్తిల్‌ (3,399)ను రోహిత్‌ వెనక్కినెట్టాడు.