IndVsWI 2nd ODI : హోప్ శతక్కొట్టుడు.. భారత్ ముందు భారీ లక్ష్యం

రెండో వన్డేలో వెస్టిండీస్ బ్యాటర్లు రాణించారు. ఓపెనర్ షై హోప్ సెంచరీతో కదంతొక్కాడు. నికోలస్ పూరన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా విండీస్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. భారత్ ముందు 312 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.

IndVsWI 2nd ODI : హోప్ శతక్కొట్టుడు.. భారత్ ముందు భారీ లక్ష్యం

Indvswi 2nd Odi

IndVsWI 2nd ODI : రెండో వన్డేలో వెస్టిండీస్ బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్ షై హోప్ సెంచరీతో కదంతొక్కాడు. నికోలస్ పూరన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా విండీస్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. భారత్ ముందు 312 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.

Hardik Pandya: హార్దిక్ పాండ్యా రిటైర్మెంట్ తేదీ వెల్లడించిన కామెంటేటర్

విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ షై హోప్ 135 బంతుల్లో 115 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 3 సిక్సులు, 8 ఫోర్లు ఉన్నాయి. నికోలస్ పూరన్ చెలరేగి ఆడాడు. సిక్సుల వర్షం కురిపించాడు. పూరన్ 77 బంతుల్లో 74 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 సిక్సులు, ఒక ఫోర్ ఉన్నాయి. కైల్ మేయర్స్ (23 బంతుల్లో 39 పరుగులు), షమ్రా బ్రూక్స్(36 బంతుల్లో 35 పరుగులు) చేశారు.

భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీశాడు. దీపక్ హుడా, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.

Team India: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎవ‌రు వ‌చ్చారో చూడండి: బీసీసీఐ

టీమిండియా టీమ్..
శిఖర్ ధావన్‌ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, సంజూ శాంసన్‌, దీపక్‌ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్‌ సిరాజ్‌, యుజ్వేంద్ర చాహల్‌, అవేశ్‌ ఖాన్‌.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

వెస్టిండీస్‌ టీమ్‌..
షై హోప్‌, బ్రాండన్ కింగ్, షమ్రా బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్‌ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, అకీల్ హోసీన్‌, రొమారియో షెఫెర్డ్‌, అల్జారీ జోసెఫ్‌, జయడెన్ సీలెస్, హేడెన్ వాల్ష్.