ఇన్ఫోసిస్ ఉద్యోగులు,వారి కుటుంబ సభ్యుల కోసం కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు

దేశంలో సెకండ్ వేవ్ తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఐటి కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ద కనబరుస్తున్నాయి.

ఇన్ఫోసిస్ ఉద్యోగులు,వారి కుటుంబ సభ్యుల కోసం కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు

Infosys Sets Up Covid Care Centres For Staff

Infosys దేశంలో సెకండ్ వేవ్ తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఐటి కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ద కనబరుస్తున్నాయి. ఇప్పటికే అనేక ఐటి కంపెనీలు తమ ఉద్యోగులకు కోవిడ్ కేర్ సదుపాయాలను కల్పిస్తున్నాయి. తాజాగా దేశంలోనే రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్..పూణే, బెంగళూరులో నివసిస్తున్న తమ ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం కొవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసినట్లు సోమవారం ప్రకటించింది.

పూణేలోని రూబీ హాల్ ఆసుపత్రి, బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిని ఈ కోవిడ్ కేర్ సెంటర్లను నిర్వహిస్తాయని ఇన్ఫోసిస్ ఓ ఈ మెయిల్ ప్రకటనలో పేర్కొంది. గ్రూప్ ఎంప్లాయి ఇన్సూరెన్స్ కింద ఉద్యోగులందరికి కొవిడ్ సంబంధిత వైద్య చికిత్స‌ల‌ను క‌వ‌ర్ చేస్తున్నారు. అంతేకాకుండా, దేశంలోని దేశంలోని అన్ని పెద్ద సిటీలలో తమ ఉద్యోగుల కోసం ఇలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు ఆ ప్రకటనలో ఇన్ఫోసిస్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న కోవిడ్-19 టెస్టింగ్ ల్యాబ్స్ తో ఇన్ఫోసిస్ అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకోవ‌డంతో పాటు దేశ‌వ్యాప్తంగా త‌మ ఉద్యోగులు, కుటుంబ స‌భ్యుల చికిత్స కోసం 242 న‌గ‌రాల్లోని 1490 ఆస్పత్రులతో భాగ‌స్వామ్యం ఏర్పాటు చేసుకుంది.

అలాగే, దేశంలోని పలు చోట్ల ఉన్న తమ క్యాంపస్ లలో వ్యాక్సినేషన్ సెంటర్లు ప్రారంభించిన ఇన్ఫోసిస్..తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు టీకాలు వేయడం వేగవంతం చేసింది. ఇక, కరోనా సోకిన ఉద్యోగులకు 21 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులను అందిస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. ఇక,యూఎస్,యూరప్ మార్కెట్ల నుంచి 85శాతం వరకు ఆదాయం పొందుతున్న ఇన్ఫోసిస్..దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆరోగ్య సంక్షోభం కారణంగా..తమ క్లయింట్ డెలివరీలపై ఎటువంటి ప్రభావం లేదని తెలిపింది.