Inox Offer : మీరాభాయి ఛానుకు లైఫ్ లాంగ్ inox సినిమా టికెట్స్ ఫ్రీ

Inox Offer : మీరాభాయి ఛానుకు లైఫ్ లాంగ్ inox  సినిమా టికెట్స్ ఫ్రీ

Inox Offer

inox offered lifetime free movie tickets to mirabai chanu : టోక్యో ఒలింపిక్స్ లో భారత దేశానికి సిల్వర్ మెడల్ సాధించిన మణిపూర్ మణిపూస మీరాభాయి ఛానుకు ఆఫర్ల మీద ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. మణిపూర్ సీఎం కోటి రూపాయల నగదుతో పాటు పోలీస్ డిపార్ట్ మెంట్ లో కమిషనర్ పోస్ట్ ప్రకటించిన విషయంతెలిసిందే. భారత రైల్వే శాఖలో పనిచేస్తున్న ఛానుకు రైల్వే శాఖ కూడా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు కోట్ల రూపాయల నగదుతో పాటు రైల్వేలో ఆఫీసర్ పోస్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. పతకం గెలిచాక భారత్ వచ్చిన ఛానును రైల్వే మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఛానుకు రూ.2 కోట్ల నగదు ఆఫీసర్ పోస్ట్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు.

తాజాగా ఓ మ‌ల్టీప్లెక్స్ చెయిన్ మీరాబాయికి జీవిత‌కాలం ఫ్రీగా సినిమా టికెట్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఆమె ఎన్ని సినిమాలు చూసినా అన్నీ ఫ్రీ అంటూ చెప్పింది ఐనాక్స్ లీజ‌ర్ లిమిటెడ్‌. మీరాబాయికే కాదు.. ఈ ఒలింపిక్స్‌లో మెడ‌ల్‌తో ఇంటికి వ‌చ్చే ప్ర‌తి భార‌త అథ్లెట్‌కు ఇదే ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని ఐనాక్స్ స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యాన్ని త‌న ట్విట‌ర్‌లో ఐనాక్స్ తెలిపింది. ఇక ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన ప్ర‌తి అథ్లెట్‌కు ఏడాదిపాటు ఫ్రీగా టికెట్లు ఇస్తామ‌నీ చెప్ప‌డం మరో విశేషం. దేశంలో ఐనాక్స్‌కు మొత్తం 648 మ‌ల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. అలాగే మీరాబాయికి ఆ మ‌ధ్య త‌న‌కు పిజ్జా అంటే ఇష్ట‌మ‌ని ఆమె చెప్ప‌గానే.. నీకు లైఫ్‌టైమ్ ఫ్రీగా పిజ్జాలు ఇస్తామ‌ని డొమినోస్ ప్ర‌క‌టించింది. ఒలింపిక్స్ లో మెడ‌ల్ గెలవటం అంటే మాటలు కాదు. కానీ టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మొట్ట మొదటి మెడల్ సంపాదించింది మీరాభాయి ఛాను. దీంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఎన్నో పేరొందిన కంపెనీలు ఛాను వెంట పడుతున్నాయి.

కాగా ఒలింపిక్స్ కు అర్హత సాధించటం ఒక ఎత్తు అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెడల్ గెలవటం మరో ఎత్తు. అది అంత ఈజీ కాదు. ఐదు ఖండాల నుంచి ఎన్నో దేశాలకు చెందిన క్రీడాకారులను ఓడించి మెడల్ సంపాదించటం అంతే అంత ఈజీగా కాదు.దానిక కృషి పట్టుదలతో పాటు చక్కటి ఫిట్ నెస్ కూడా ఉండాలి. మెడల్ గెలవగలను అనే మానసిక దఢత్వం కావాలి. ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోను కోల్పోకూడదు. అలా ఛాను మానసికంగా శారీరకంగా బలంగా ఉండటానికి ఎంతో శ్రమ పడింది. ఆ శ్రమకు ఫలితం దక్కింది.

మెడల్ గెలిచాక ఛాను ఓ సందర్భంగా మాట్లాడుతూ..49కేజీల విభాగంలో ఉండాలని తాను పడిన శ్రమను ఇలా చెప్పారు మీరాబాయి. బరువును ఒకేలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. మన డైట్ ను స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేసుకోవాలి. జంక్ ఫుడ్ తినలేదు. తక్కువ మొత్తంలోనే మాంసం, పప్పులు మొదలైనవి తీసుకున్నా’ అని తెలిపారు. రియో ఒలింపిక్స్ తర్వాత తాను ఇండియా తరపున ఆడి గోల్డ్ మెడల్ తీసుకురావాలనే అనుకున్నాననీ… ఆ పట్టుదలే తనను టోక్యో ఒలింపిక్స్ వరకూ చేర్చిందని అన్నారు. ‘పతకం గెలుచుకోవాలనే కాన్ఫిడెన్స్ రియో ఒలింపిక్స్ నుంచే వచ్చింది. రియో గేమ్స్ లో అసంతృప్తి తర్వాత రాబోయే కాంపిటీషన్ కు మెడల్ కచ్చితంగా గెలుచుకోవాలని ఫిక్స్ అయ్యా. ఏదైనా నా బెస్ట్ ఫర్ ఫార్మెన్స్ ఇస్తేనే వస్తుందని నాకు తెలుసు. నా కోచ్ విజయ్ శర్మ నన్ను చాలా మోటివేట్ చేశారు. రియోలో జరిగిన దానిని మరచిపోవాలని భవిష్యత్ మీద ఫోకస్ పెట్టాలని అన్నారు. అతని వల్లనే నేనిక్కడ వరకూ రాగలిగాను.

లాక్ డౌన్ రిలాక్స్ అయిన తర్వాతే ప్రిపరేషన్ మొదలుపెట్టా. గాయాలు కావడంతో చాలా కాలం రెస్ట్ తీసుకుని తర్వాతనే మొదలుపెట్టా. గతేడాది అక్టోబరులో యూఎస్ఏ వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం. అక్కడ తీసుకున్న 20రోజుల ట్రైనింగ్ బాగా హెల్ప్ అయింది. వరల్డ్ ఛాంపియన్ షిప్ లోనూ రికార్డ్ బ్రేక్ చేశా. యూఎస్ఏలో గడిపిన సమయం ట్రైనింగ్ కు బాగా హెల్ప్ అయిందని మీరాబాయి చెప్పారు.