Living Worm: వృద్ధురాలి కంట్లో బ్రతికున్న కీటకం.. దాని పొడవెంతో తెలుసా?

మన కంట్లో చిన్న నలుసు పడితే అల్లాడిపోతాం. గాలి దుమ్ము ఎగిరి కళ్ళలో పడితే మనకి తెలియకుండానే కళ్ళ నుండి నీరు వచ్చేస్తుంది. అంత సెన్సెటివ్ గా ఉంటాయి మన కళ్ళు. అలాంటి కంట్లో ఓ కీటకం చేరి అది తిరుగుతుంటే ఎలా ఉంటుందో ఊహకే కష్టంగా అనిపిస్తుంది.

Living Worm: వృద్ధురాలి కంట్లో బ్రతికున్న కీటకం.. దాని పొడవెంతో తెలుసా?

Living Worm

Living Worm: మన కంట్లో చిన్న నలుసు పడితే అల్లాడిపోతాం. గాలి దుమ్ము ఎగిరి కళ్ళలో పడితే మనకి తెలియకుండానే కళ్ళ నుండి నీరు వచ్చేస్తుంది. అంత సెన్సెటివ్ గా ఉంటాయి మన కళ్ళు. అలాంటి కంట్లో ఓ కీటకం చేరి అది తిరుగుతుంటే ఎలా ఉంటుందో ఊహకే కష్టంగా అనిపిస్తుంది. కానీ ఓ వృద్ధురాలు ఆ బాధను భరించింది. ఆమెకి చికిత్స చేసిన వైద్యులు కూడా ఆమె కంట్లోని పురుగును చూసి అవాక్కయ్యారు. ఆ పురుగు కంట్లో నుండి బయటకి తీస్తుంటే ఏకంగా తొమ్మిది సెంటీమీటర్ల పొడవున బయటకి వస్తూనే ఉందట. ఈ ఘటన కర్ణాటకలోని ఉడుపిలో జరిగింది.

కంటినొప్పితో బాధపడుతున్న ఓ 70 ఏళ్ల వృద్ధురాలు జూన్​ 1న చికిత్స కోసం ఉడుపిలోని ప్రసాద్​ నేత్రాలయకు వెళ్లింది. ఆమె కళ్ళను పరీక్షించిన వైద్యులు ఒక కంటిలో సజీవంగా ఉన్న ఓ కీటకం ఉన్నట్లు గుర్తించారు. కీటకం కదలకుండా ఉండేలా ఆమెకి నొప్పి తెలియకుండా ఉండేలా మందులు ఇచ్చి ఆమెను ఇంటికి పంపించారు. కానీ, వైద్యులు అనుకున్నట్లుగా ఆ కీటకం సైలెంట్ ఉండలేదు. ఇంకా ఎక్కువగా కదులుతూ కంట్లో రచ్చ రచ్చ చేయసాగింది. దీంతో ఆమెకి తీవ్రమైన కంటినొప్పి, మంట వేధించాయి.

దీంతో ఆమె సోమవారం మళ్లీ ఆస్పత్రికి చేరుకోవడంతో వైద్యులు వెంటనే ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. కంటిలోపలి పొరలో దాగి ఉన్న ఆ కీటకాన్ని బయటకు తీసి వైద్యులే ఆశ్చర్యానికి గురయ్యారు. తొమ్మిది సెంటీమీటర్ల పొడవున సన్నగా ఓ దారం మాదిరి ఆ కీటకం బ్రతికి ఉండి కదులుతూనే ఉంది. గతంలో ఎన్నడూ కంటిలో ఇలాంటి కీటకాన్ని చూడని వైద్యులు ఈ పురుగుపై మరింత అధ్యయనం చేసేందుకు లేబొరేటరీకి పంపించారు.